తెలకపల్లి ప్రాథమిక ఉన్నత పాఠశాలను ఆకస్మికంగా సందర్శించిన అదనపు కలెక్టర్ జి.వి. శ్యామ్ ప్రసాద్ లాల్.

డ్రగ్స్‌కు దూరంగా ఉండాలని విద్యార్థులకు అవగాహన కల్పించిన అధికారులు.

పయనించే సూర్యుడు. మార్చి 26. నాగర్ కర్నూల్ జిల్లా. తెల్కపల్లి మండలం రిపోర్టర్ :సుల్తాన్. నాగర్ కర్నూల్ జిల్లా.తెల్కపల్లి ప్రాథమిక ఉన్నత పాఠశాలను ఆడిసినల్ కలెక్టర్ జి. వి.శ్యామ్ ప్రసాద్ లాల్ ఆకస్మికంగా సందర్శించి మధ్యాహ్న భోజనాన్ని పాఠశాల నిర్వహణను పరిశీలించారు.పదవ తరగతి విద్యార్థులతో మాట్లాడుతూ రాబోయే ఏడు సంవత్సరాలు ఏకాగ్రతతో చదువుపై దృష్టి నిలవాలని డ్రగ్స్ ,గంజాయి వంటి దురలవాట్లకు గురి కావద్దని ,బాలికలు చక్కగా చదువుకోవాలని బాల్య వివాహాలు చేసుకోకుండా తల్లిదండ్రులను ఒప్పించి ఉన్నత చదువులు చదువుకోవాలని సూచించారు. ఏకలవ్యూని కథను వివరిస్తూ మీరు పదవ తరగతిలో మంచి మార్కులతో ఉత్తీర్ణులు కావడమే మీ గురువులకు ఇచ్చే కానుక అని విద్యార్థులను కోరారు.మధ్యాహ్న భోజనాన్ని పరిశీలించి మెనూ ప్రకారము వంట చేశారా లేదా అని పరిశీలించారు. తర్వాత విద్యార్థులతో కలిసి భోజనం చేయడం జరిగింది. అనంతరం పాఠశాల ఉపాధ్యాయులతో సమావేశం నిర్వహించి ఈ పాఠశాల విద్యార్థులందరూ మీ పిల్లలుగా భావించి చక్కని విద్యను అందించాలని ఏ రకమైన వివాదాలు లేకుండా పాఠశాలను ఉత్తమంగా నిర్వహించాలని ఉపాధ్యాయులకు సూచించారు.ఈ కార్యక్రమం లో మండల విద్యాధికారి సి.శ్రీనివాస్ రెడ్డి పాఠశాల ప్రధానోపాధ్యాయులు శోభన్ బాబు, పాఠశాల ఉపాధ్యాయులు ఎం ఆర్ సి బృందం పాల్గొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *