దాబుగుడ, కమలతోట రోడ్డు వెంటనే మరమ్మతు చేయాలిఆదివాసీ గిరిజన సంఘం నాయకులు రమేష్ రామన్న డిమాండ్

పయనించే సూర్యుడు మార్చి తేదీ 26 రూలర్ ప్రతినిధి బి బాసు అల్లూరి సీతారామరాజు జిల్లా అరకువ్యాలీ మండలం కేంద్రం పరిధిలో మాదల గ్రామపంచాయతీ కిచెందిన గ్రామాలు మజ్జివలస, తోటవలస, దాబుగుడ, వయా కమలతోట, ఒరిస్సా నేషనల్ 6,లైన్ హైవే లింకు రోడ్డు తక్షణమే ప్రారంభించాలని పంచాయతీ స్థానిక ఆదివాసి గిరిజన సంఘం నాయకులు డిమాండ్ చేశారు ఆదివాసీ గిరిజన సంఘం నాయకులు రమేష్ మీడియాతో సమావేశానికి మాట్లాడుతూ, అనేక పోరాటం ద్వారా సాధించిన రోడ్డు మంజూరు అయ్యి నేటికి దాదాపు 12 సంవత్సరకాలం పూర్తి అవుతున్న 7.కిలో మీటర్ రోడ్డు పూర్తి చేయాలేని కాంట్రాక్టు పై ఉన్నతధికారులు చర్య తీసుకుని (ఆంధ్ర - ఒరిస్సా) రోడ్డు తక్షణమే పూర్తిచేసి ప్రయాణికులకు రోడ్డు అందించాలని కోరారు అందుబాటు లేని యెడల భవిష్యత్తులో ఉద్యమం తప్పవని ప్రభుత్వానికి హెచ్చరించిన నాయకులు మరియుఈ కార్యక్రమానికి రామన్న భాస్కరావు తదితరులు పాల్గొన్నారు