
పయనించే సూర్యుడు మార్చి 26 (ఆత్మకూరు నియోజవర్గం ప్రతినిధి మన్నేపల్లి తిరుపతయ్య) చేజర్ల మండలం నాగులవెల్లటూరు గ్రామం నందు బుధవారం వ్యవసాయ మార్కెట్ కమిటీ ఆత్మకూరు పశుసంవర్ధక శాఖ వారి ఆధ్వర్యంలో ఉచిత పశు వైద్య శిబిరము జరిగినది ఈ కార్యక్రమంలో ఆత్మకూరు వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్మన్ ఆరికట్ల జనార్దన్ . సోమశిల ప్రాజెక్టు చైర్మన్ వేలూరు కేశవ చౌదరి . ఉపసంచాలకులు పశుసంవర్ధక శాఖ డాక్టర్ నాగమణి .సహాయ సంచాలకులు ప్రాంతీయ పశువైద్యశాల కలువాయి డాక్టర్ గురుజయంతి . చేజర్ల పశువైద్యాధికారి డాక్టర్ పి రాజేష్ పశుసంవర్ధక శాఖ సిబ్బంది సజ్జాద్,శ్రీకాంత్, మల్లికార్జున, వెంకటేష్, నాగులవెల్లటూరు గ్రామ పాడి రైతులు పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో పాడిపశువులకు చూటి పరీక్షలు గర్భకోశ వ్యాధి పరీక్షలు, దూడలకు నట్టల నివారణ మందులు అందించారు. ఈ కార్యక్రమంలో పశు వైద్య శాఖ సిబ్బంది గ్రామ ప్రజలు తదితరులు పాల్గొన్నారు