పంచాయతీరాజ్ రోడ్లకు నిధులు విడుదల చేస్తాం

ఎమ్మెల్యే కవ్వంపల్లికి మంత్రి సీతక్క హా

పయనించే సూర్యుడు న్యూస్ :మార్చి /26 :నియోజకవర్గం స్టాప్ ప్రతినిధి:సాయిరెడ్డి బొల్లం :మానకొండూర్ నియోజకవర్గం పరిధిలో చేపట్టిన పంచాయతీ రాజ్ రోడ్లకు సత్వరమే నిధులు విడుదల చేస్తామని రాష్ట్ర పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి శాఖ మంత్రి సీతక్క చెప్పారు. బుధవారం మానకొండూర్ ఎమ్మెల్యే డాక్టర్ కవ్వంపల్లి సత్యనారాయణ నేతృత్వంలో ఆరు మండలాలకు చెందిన సర్పంచులు,పార్టీ నాయకులు అసెంబ్లీలోని చాంబర్ లో వినతిపత్రం అందజేయగా, ఈ మేరకు ఆమె వారికి హామీ ఇచ్చారు. పంచాయతీరాజ్ ,గ్రామీణాభివృద్ధిశాఖల ద్వారా చేపట్టిన పనులకు సంబంధించి నిధులు విడుదల చేయడమే కాకుండా భవిష్యత్తులు బడ్జెట్ లో అధిక నిధులు కేటాయిస్తామన్నారు. మానకొండూర్ నియోజకవర్గంలోని పలు మండలాల్లో సుమారు 30.44 కోట్ల రూపాయల విలువ చేసే పనులకు చేపట్టడం జరిగిందని, అయితే నిధులు విడుదల కాకపోవడం వల్ల పనులు అర్థంతరంగా నిలిచిపోయాయని, దీంతో ప్రజలు తీవ్ర అసౌకర్యాలకు గురవుతున్నారని, వెంటనే ఆ నిధులు విడుదల చేయాలని మంత్రిని వారు కోరారు. దీనికి సానుకూలంగా స్పందించిన మంత్రి సీతక్క నిధుల విడుదలకు హామీ ఇచ్చారు. గన్నేరువరం మండల పరిషత్ భవన నిర్మాణానికి హామీ నూతనంగా ఏర్పాటైన గన్నేరువరం మండల కేంద్రంలో మండల పరిషత్ కార్యాలయం నూతన భవన నిర్మాణానికి మంత్రి సీతక్క హామ ఇచ్చారు. మండల పరిషత్ కార్యాలయాన్ని కొనసాగిస్తున్న అద్దె భవనంలో సౌకర్యాలు లేక ఇక్కట్లు గురవుతున్నామని మంత్రి దృష్టికి తీసుకు రాగా, ఆమె సానుకూలంగా స్పందిస్తూ గన్నేరువరం మండల పరిషత్ కార్యాలయానికి త్వరలోనే నూతన కార్యాలయం నిర్మిస్తామని ఆమె హామీ ఇచ్చారు. పచ్చునూరు మండలం ఏర్పాటును పరిశీలిస్తాం పచ్చునూరును మండలంగా ఏర్పాటు చేయాలని ఆ మండలానికి చెందిన ప్రజాప్రతినిధులు, కాంగ్రెస్ పార్టీ నాయకులు మంత్రి సీతక్కను కోరారు. మానకొండూర్ మండలం పరిధిలోని పచ్చునూరు గ్రామాన్ని మండలంగా ఏర్పాటు చేయాలని చాలా ఏళ్లుగా ప్రభుత్వాలను కోరుతూనే ఉన్నామని, ఇప్పటికైనా పచ్చునూరును మండలంగా ఏర్పాటు చేయాలని, నూతనంగా ఏర్పాటు చేయనున్న మండలాల జాబితాలో పచ్చునూరు కూడా చోటు కల్పించాలని వారు కోరగా, మంత్రి పచ్చునూరును మండలంగా ఏర్పాటుపై సాధ్యాసాధ్యాలను పరిశీలిస్తామని చెప్పారు. మంత్రి సీతక్కను కలిసిన బృందంలో ఎమ్మెల్యే డాక్టర్ కవ్వంపల్లి సత్యనారాయణతోపాటు బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షులు ఒగ్గు దామోదర్,సుధగోని లక్ష్మినారాయణ గౌడ్, ఇల్లంతకుంట, బెజ్జంకి, గన్నేరువరం, మానకొండూర్ మండలాల పార్టీ అధ్యక్షులు కోమటిరెడ్డి భాస్కర్ రెడ్డి, ముక్కిస రత్నాకర్ రెడ్డి, ముస్కు ఉపేందర్ రెడ్డడి, నందగిరి రవీంద్రచారి, మాజీ ఎంపీపీలు ఊట్కూరి వెంకట రమణారెడ్డి, గుడిసె అయిలయ్య,శ్రీగిరి రంగారావు, పార్టీ నాయకులు ఆకుల సత్యం, ద్యావ శ్రీనివాస్ రెడ్డి, ముద్దసాని శ్రీనివాస్ రెడ్డి, మన్మోహన్ రావు, ఆర్.తిరుమల్ రెడ్డి, గొల్లెన కొమురయ్య,బుర్ర శ్రీధర్, రెడ్డిగాని రాజు, మాతంగి అనిల్, ఆర్.రాజమల్లయ్య తదితరులు ఉన్నారు.