పిల్లల ప్రాణాలతో చెలగాటం ఆడుతున్న లిటిల్ ఏంజెల్స్ స్కూల్ ని సిజ్ చేయాలి

★ అత్యంత ప్రమాదకరంగా విద్యార్థులను వ్యాన్లో తరలిస్తున్న స్కూల్ యాజమాన్యం పై క్రిమినల్ కేసు నమోదు చేయాలి. ★ ఆర్ పి ఎస్ ఎఫ్, పి ఆర్ ఎస్ వై ఎఫ్ విద్యార్ధి సంఘం నాయకులు.

పయనించే సూర్యుడు మార్చి 26 ఆదోని నియోజకవర్గం ప్రతినిధి బాలకృష్ణ. ఆలూరు పట్టణం లో విద్యార్థుల ప్రాణాలతో చెలగాటమాడుతున్న లిటిల్ ఏంజెల్స్ స్కూల్ సిజ్ చేయాలని ఆర్ పి ఎస్ ఎఫ్ రాష్ట్ర కార్యదర్శి షాహిద్ ఆఫ్రిది, పి ఆర్ ఎస్ వై ఎఫ్ జిల్లా అధ్యక్షుల రఘునాథ్ లు డిమాండ్ చేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ లిటిల్ ఏంజెల్ స్కూల్లో విద్యార్థులు తీసుకువెళ్లడానికి సరైన బస్సులు లేక వ్యానులలో తరలిస్తూ విద్యార్థుల జీవితాలతో చెలగాటమాడుతున్నారు, కానీ స్కూల్ యాజమాన్వారు విద్యార్థులను నుంచి బస్సుల ఫీజులని నెల నెల వేల రూపాయల వసూలు చేస్తున్న బస్సులు ఏర్పాటు చేయడంలో నిర్లక్ష్యం వహిస్తూ విద్యార్థుల జీవితాలతో చెలగాటమాడుతున్నారు వారి ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇప్పటికైనా విద్యాధికారులు రవాణా శాఖ అధికారులు స్పందించి ఆటోలలో వ్యాన్లలో విద్యార్థులు తరలిస్తున్న లిటిల్ ఏంజెల్స్ స్కూల్ యాజమాన్యం పై కేసులను నమోదు చేసి స్కూల్ ని సిజ్ చేయాలని వారు డిమాండ్ చేశారు లేని పక్షంలో కలెక్టర్ దృష్టికి తీసుకెళ్తామని వారు హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో నాయకులు సురేష్ విష్ణు ఖాదర్ తదితరులు పాల్గొన్నారు.