ప్రతి ఒక్కరూ రోడ్డు భద్రతా నియమాలు పాటించాలి

పయనించే సూర్యుడు-26-03-2026-రాజంపేట న్యూస్ : ప్రతి ఒక్కరూ రోడ్డు భద్రత నియమాలు పాటించి సురక్షితంగా ఉండాలని ఏ ఎస్ పి మనోజ్ రామ్ నాథ్ హెగ్డే మరియు జనసేన పార్టీ రాజంపేట పార్లమెంటు ఇంచార్జి యల్లటూరు శ్రీనివాసరాజు సూచించారు. బుధవారం పట్టణ పోలీస్ స్టేషన్ నందు వెల్లటూరు శ్రీనివాసరాజు ఆధ్వర్యంలో ఏఎస్పీ మనోజ్ రామ్నాథ్ హెగ్డే చేతుల మీదుగా పాత్రికేయులు, పోలీసులు మరియు యువతకు హెల్మెట్లు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఏ.ఎస్.పి మరియు యల్లటూరు మాట్లాడుతూ రోడ్డు భద్రత పై అవగాహన పెంపొందించడం, ట్రాఫిక్ నిబంధనల అమలుకు ప్రాధాన్యం ఇవ్వడం మరియు సామాజిక బాధ్యతలో భాగంగా ఈ హెల్మెట్ పంపిణీ కార్యక్రమాన్ని చేపట్టడం జరిగిందని తెలిపారు. ప్రత్యేక డ్రైవ్ లు మరియు ప్రచార కార్యక్రమాల ద్వారా పోలీసులు హెల్మెట్ ధరించడం యొక్క ప్రాముఖ్యతను ప్రజల్లోకి తీసుకెళ్తున్నారని తెలిపారు. అనంతరం పట్టణ పోలీస్ స్టేషన్ నుండి పాత బస్టాండ్ వరకు పెద్ద ఎత్తున బైక్ ర్యాలీ నిర్వహించారు. ఈ కార్యక్రమంలో జనసేన పార్టీ నాయకులు, కార్యకర్తలు, పోలీసులు, ప్రజలు పాల్గొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *