ప్రయాణికులకు మజ్జిగ పంపిణి బిజెపి నాయకులు

పయనించే సూర్యుడు మార్చి 26 (ఆత్మకూరు నియోజవర్గం ప్రతినిధి మన్నేపల్లి తిరుపతయ్య) చేజర్ల మండలం అదురుపల్లి లో బుధవారం బీజేపీ పార్టీ . బీజేవైఎం మండల అధ్యక్షులు కుండా శివారెడ్డి ఆధ్వర్యంలో ప్రయాణికులకు మజ్జిగ పంపిణి చేసారు. ఈ కార్యక్రమం లో రాష్ట్ర వడ్డెర కార్పొరేషన్ డైరెక్టర్ బత్తల కిష్టయ్య పాల్గొని ఎండల తీవ్రత ఎక్కువ గా వున్న నేపథ్యంలో రోడ్డు మార్గంలో ప్రయాణించే వాహనదారులకు మజ్జిగ చాలా మందికి ఉపశమనం అవుతుందని తెలిపారు . ప్రతి ఏటా ఈ కార్యక్రమం చేస్తామని ఈ సంవత్సరం కూడా బీజేపీ ఆధ్వర్యంలో చేయడం సంతోషం వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమం బీజేవైఎం మండల యువత పాల్గొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *