పయనించే సూర్యుడు, మార్చ్ 26, బచ్చన్నపేట మండల ప్రతినిధి: నీల పవన్. బచ్చన్నపేట మండల కేంద్రంలోని పశువుల అంగడి వేలం 5.67 లక్షలకు దక్కించుకున్నారు. మండల కేంద్రంలోని ప్రతీ ఆదివారం నిర్వహించే పశువుల, గొర్రెలు, మేకల అంగడిని దక్కించుకునేందుకు పలువురు జౌత్యాహికులు పోటీ పడ్డారు. బచ్చన్నపేట గ్రామ పంచాయతీ కార్యాలయంలో మంగళవారం ఎంపీవో శ్రీధర్ రెడ్డి. గ్రామ సర్పంచి అల్వాల నర్సింగరావు, పంచాయతీ కార్యదర్శి అనిల్ రాజు ఆధ్వర్యంలో వేలం నిర్వహించారు. వేలంలో పశువుల అంగడి మంచాల వినయ్ కుమార్ 5.67లక్షలకు,తైబజారును 3.81 లక్షల రూపాయాలకు దాచేపల్లి మల్లేశం పశువుల అంగడిలో డక్క 52 వేల రూపాయాలకు ఎండీ అజీమ్ దక్కించుకున్నారని వారు తెలిపారు.కార్యక్రమంలో వార్డు సభ్యులు తదితరులు పాల్గొన్నారు.