బసాపురం గ్రామంలో రైతన్న మీకోసం వారోత్సవాలు.

హాజరైన టిడిపి సీనియర్ నాయకుడు ఉమాపతి నాయుడు.

పయనించే సూర్యుడు మార్చ్ 26 ఆదోని నియోజకవర్గం క్రైమ్ రిపోర్ట్ కృష్ణ. రైతన్న మీకోసం వారోత్సవాలు అనే కార్యక్రమాన్ని ఈరోజు బసాపురం గ్రామంలో ఆదోని నియోజకవర్గం టిడిపి ఇన్చార్జి మీనాక్షి నాయుడు ఆదేశాల మేరకు, టిడిపి సీనియర్ నాయకులు ఉమాపతి నాయుడు పాల్గొన్నారు మన ముఖ్యమంత్రి ఆదేశాల మేరకు ఈరోజు ముఖ్య అతిథిగా ఎమ్మెల్సీ బిటి నాయుడు మరియు టిడిపి సీనియర్ నాయకులు ఉమాపతి నాయుడు బసాపురం గ్రామంలో నిర్వహించిన 6వ విడత అన్నదాత సుఖీభవ ఇంటింటా ప్రచార కార్యక్రమంలో పాల్గొన్నారు.ఈ సందర్భంగా గ్రామంలోని లబ్ధిదారుల ఇళ్లకు స్వయంగా వెళ్లి కేంద్ర ప్రభుత్వం అమలు చేస్తున్న పీఎం కిసాన్ మరియు రాష్ట్ర ప్రభుత్వం చేపట్టిన అన్నదాత సుఖీభవ పథకాల ద్వారా రైతన్నల ఖాతాల్లో జమవుతున్న పెట్టుబడి సహాయ నిధుల వివరాలను ప్రజలకు తెలియజేశారు.అలాగే ప్రకృతి వ్యవసాయం ప్రోత్సాహం, ప్రభుత్వం సబ్సిడీ రూపంలో అందిస్తున్న వ్యవసాయ పరికరాలు, వడ్డీ లేని రుణాలు మరియు ఆధునిక సాంకేతికతతో సాగు చేసి రైతులు లాభసాటి వ్యవసాయం వైపు ముందుకు సాగాలని అవగాహన కల్పించారు.రైతు సంక్షేమమే ప్రభుత్వ ధ్యేయమని, ప్రతి రైతు కుటుంబానికి పథకాల ప్రయోజనాలు చేరేలా పార్టీ శ్రేణులు కృషి చేస్తున్నాయని ఈ సందర్భంగా తెలిపారు.ఈ కార్యక్రమంలో పాల్గొన్న నాయకులు ఎల్ఎంసి వాటర్ చైర్మన్ రామస్వామి, శ్రీకాంత్ రెడ్డి, ఉమ్మి సలీం, రాష్ట్ర హౌసింగ్ బోర్డ్ డైరెక్టర్ రామకృష్ణ, నీలకంఠప్ప, పట్టణ అధ్యక్షులు తిమ్మప్ప, మండల అధ్యక్షులు శివప్ప, సత్తన్న, రంగన్న, అయ్యన్న, వీరారెడ్డి, సుధాకర్, శేఖర్, తదితరులు పాల్గొన్నారు.