
పయనించే సూర్యుడు, మార్చ్ 26, దేవరకొండ టౌన్ న్యూస్ రిపోర్టర్, వల్లపు నరేష్ నల్గొండ జిల్లా. దేవరకొండ బార్ అసోసియేషన్ అధ్యక్షులుగా సన్నాయిల ఉమామహేశ్వర్ ఏకగ్రీవంగా ఎన్నికైనట్లు ఎన్నికల అధికారి రియాజుద్దీన్ తెలిపారు, గత మూడు సంవత్సరాలుగా దేవరకొండ బార్ అసోసియేషన్ అధ్యక్షులుగా కొనసాగుతూ కక్షాదారులకు న్యాయ సంబంధమైన కేసులను వాదిస్తూ ప్రజల్లో మంచి గుర్తింపు పొందిన ఆయనను ఏకగ్రీవంగా ఎన్నుకున్నట్లు అసోసియేషన్ సభ్యులు తెలిపారు, అనంతరం నూతన కమిటీ ఎన్నుకోవడం జరిగినది అధ్యక్షులుగా సన్నాయిల ఉమామహేశ్వర్, ప్రధాన కార్యదర్శిగా వనం జగదీశ్వర్, కోశాధికారిగా ఈడం రవికుమార్,ఉపాధ్యక్షులుగా ఎల్కే దుర్గా, బి శ్రీనివాస్, సహాయ కార్యదర్శులుగా సిలువేరు పుష్పలత, ఎం యాదయ్య, కల్చరల్ కార్యదర్శిగా శంకర్, మరియు ఇతర సభ్యులను ఏకగ్రీవంగా ఎన్నుకోవడం జరిగిందని ఆయన తెలిపారు, ఎన్నికైన సభ్యులను సీనియర్ న్యాయవాదులు గాజుల ఆంజనేయులు, రోహిత్ రెడ్డి, ముస్తాక్ అహ్మద్, మరియు ఎలక్షన్ అధికారి రియాజుద్దీన్ తదితరులు పాల్గొని నూతన కమిటీకి శుభాకాంక్షలు తెలిపారు,