పయనించే సూర్యుడు న్యూస్ చండూరు, మార్చి 26 : చండూరు మండలం బోడంగిపర్తి గ్రామానికి చెందిన బీజేపీ చండూరు మండల కోశాధికారి బరిగల లింగస్వామి, బోడంగిపర్తి మాజీ బూత్ అధ్యక్షుడు పందుల గిరి, యువజన నాయకుడు వర్కాల స్వామితో పాటు పలువురు బీజేపీ కార్యకర్తలు బుధవారం మునుగోడు మాజీ ఎమ్మెల్యే కూసుకుంట్ల ప్రభాకర్ రెడ్డి, బీఆర్ఎస్ పార్టీ రాష్ట్ర నాయకుడు, కల్లుగీత కార్మిక ఫైనాన్స్ కార్పొరేషన్ మాజీ చైర్మన్ పల్లె రవికుమార్ గౌడ్ సమక్షంలో తెలంగాణ భవన్ హైదరాబాదులో బీఆర్ఎస్ పార్టీలో చేరారు. ఈ కార్యక్రమంలో బోడంగిపర్తి బీఆర్ఎస్ గ్రామ శాఖ అధ్యక్షుడు కట్కూరి సత్తయ్య, యూత్ అధ్యక్షుడు కట్కూరి మహేశ్, సీనియర్ నాయకులు వర్కాల శ్రవణ్ కుమార్, వర్కల శంకరయ్య, కడారి నరసింహ, దోటి నిరంజన్, షేక్ సత్తార్, వర్కల అంభేథ్కర్, వర్కాల నరసింహ, చెదురువెల్లి స్వామి పాల్గొన్నారు.