బీసీలకు 20 వేల కోట్లు కేటాయించాలి – బిజినపల్లిలో నల్ల బ్యాడ్జీలతో నిరసన

కార్యక్రమంలో అధ్యక్షులు సత్యశీల సాగర్ ఉపాధ్యక్షులు అబ్బ కరుణాకర్

పయనించే సూర్యుడు మార్చి 26 నాగర్ కర్నూలు జిల్లా బిజినపల్లి రిపోర్టర్ కే శ్రావణ్ కుమార్ నాగర్ కర్నూల్ జిల్లా బిజినపల్లి మండల కేంద్రంలో బీసీ సంఘాల ఆధ్వర్యంలో నల్ల బ్యాడ్జీలు ధరించి నిరసన కార్యక్రమం నిర్వహించారు. అసెంబ్లీ బడ్జెట్ సమావేశంలో బీసీలకు రూ.20 వేల కోట్లు కేటాయించాలని, బీసీ రక్షణ చట్టాన్ని తీసుకురావాలని డిమాండ్ చేశారు. అలాగే కామారెడ్డిలో ప్రకటించిన విధంగా బీసీ సబ్ ప్లాన్‌ను వెంటనే అమలు చేయాలని నాయకులు కోరారు. ఈ కార్యక్రమంలో బీసీ అధ్యక్షుడు సత్యశిల సాగర్, ఉపాధ్యక్షుడు అబ్బ కరుణాకర్ ముదిరాజ్, మాదేవునిపేట సర్పంచ్ ఆంజనేయులు, లట్టుపల్లి బీసీ నాయకుడు మంగంపేట శ్రీనివాసులు, మంగనూరు నాయకులు మాసన్న తిరుపతయ్య, వట్టెం చిన్నయ్య తదితరులు పాల్గొన్నారు.