బెజ్జంకి జాతర పోస్టర్ ఆవిష్కరించిన ఎమ్మెల్యే కవ్వంపల్లి

పయనించే సూర్యుడు న్యూస్ :మార్చి /26: నియోజకవర్గం స్టాప్ ప్రతినిధి:సాయిరెడ్డి బొల్లం :సిద్దిపేట జిల్లా మానకొండూర్ నియోజకవర్గం బెజ్జంకి మండలం లోని బెజ్జంకి శ్రీ లక్ష్మీనృసింహస్వామి బ్రహ్మోత్సవాల పోస్టర్‌ను మానకొండూర్ ఎమ్మెల్యే, టీపీసీసీ ఎస్సీ విభాగం చైర్మన్ డాక్టర్ కవ్వంపల్లి సత్యనారాయణ బుధవారం హైదరాబాద్ లో ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ జాతర మహోత్సవాలు ఘనంగా నిర్వహించాలని ఆలయ ధర్మకర్తలను కోరారు. ఆలయంలో ప్రతియేటా చైత్ర శుద్ధసప్తమి నుంచి చైత్ర బహుళ సప్తమి వరకు జరిగే ఈ బ్రహోత్సవాలను వైభవోపేతంగా నిర్వహించాలన్నారు. ఏకశిలతో నిర్మితమైన ఈ ఆలయానికి ఎంతో ప్రాశస్యత ఉందని, కోరికలు తీర్చే ఇలవేల్పుగా భావిస్తూ భక్తులు ఈ జాతరకు కరీంనగర్, సిద్ధిపేట, హైదరాబాద్, వరంగల్, నిజామాబాద్, ఆదిలాబాద్ జిల్లాల నుంచే కాకుండా నాగపూర్, నాందేడ్, గుల్బర్గా, ముంబాయి వంటి దూర ప్రదేశాల నుంచి భారీగా తరలి వస్తుంటారని, భక్తులకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా అన్ని సదుపాయాలు కల్పించాలన్నారు.విజయవంతంగా జాతర నిర్వహించేందుకు అందరూ తమవంతు సహకారం అందించాలని కోరారు. శ్రీ లక్ష్మీనరసింహస్వామి ఆశీస్సులతో ప్రజలందరూ సుఖసంతోషాలతో, ఆయురారోగ్యాలతో ఉండాలని ఎమ్మెల్యే డాక్టర్ కవ్వంపల్లి ఆకాంక్షించారు. అంతకు ముందు ఆలయ చైర్మన్ జెల్ల ప్రభాకర్ పూజారి,ధర్మకర్తలతో కలిసి ఎమ్మెల్యే డాక్టర్ కవ్వంపల్లికి బ్రహ్మోత్సవాల ఆహ్వాన పత్రికను అందించారు. స్వామివారి కళ్యాణం, శకటోత్సవం, రథోత్సవాలకు హాజరు కావల్సిందిగా వారు ఎమ్మెల్యేను ప్రత్యేకంగా ఆహ్వానించారు. ఈ కార్యక్రమంలో ఆలయ కమిటీ చైర్మన్ జెల్ల ప్రభాకర్, బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షులు, మాజీ ఎంపీపీ ఒగ్గు దామోదర్, మండల పార్టీ అధ్యక్షుడు ముక్కిస రత్నాకర్ రెడ్డి, ఆలయ పూజారి శేష మధుసూదనచారి, ధర్మకర్తలు బెజుగాం ప్రసాద్, గుబిరే చంద్రం, పొట్లపల్లి ప్రభాకర్, బోనాల మల్లేశం, మాజీ సర్పంచ్ రావుల నర్సయ్య, పురుమ నారాయణరెడ్డి, ఐలేని మహేందర్ రెడ్డి, బుట్ల చంద్రప్రకాశ్, ఇస్కిల్లా ఐలయ్య, బోనగిరి శ్రీనివాస్, కొండ్ల ప్రకాష్, జంగిటి శంకర్, దొమ్మాటి శ్రీహరి తదితర నాయకులు పాల్గొన్నారు.