బొప్పల్లి ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో ఉచిత మెగా వైద్య శిబిరం విజయవంతం.

వైద్య శిబిరంలోపాల్గొన్నజిల్లా వైద్య ఆరోగ్యశాఖ అధికారి డాక్టర్ రవి నాయక్.

పయనించే సూర్యుడు. మార్చి 26.నాగర్ కర్నూల్ జిల్లా. తెల్కపల్లి మండలం రిపోర్టర్ :సుల్తాన్. నాగర్ కర్నూల్ జిల్లా. తెల్కపల్లి మండలం బొప్పల్లి గ్రామంలో ప్రజా పాలన 99 రోజుల ప్రణాళికలో భాగంగా మండల పరిధిలోని బొప్పల్లి ప్రాథమిక ఆరోగ్య కేంద్రం లో బుధవారం నిర్వహించిన మెగా వైద్య శిబిరం విజయవంతం అయినట్ల బొప్పల్లి ప్రాథమిక ఆరోగ్య కేంద్రం వైద్య అధికారి డాక్టర్ నాగేశ్వరీ తెలిపారు. ఈ మెగా వైద్య శిబిరాన్ని బొప్పల్లి సర్పంచ్ మహేశ్వరం నవ్య మల్లాచారి ప్రారంభించారు. ఈ వైద్య శిబిరంలో స్త్రీ వైద్య నిపుణులు ఎముకలు మరియు కీళ్ల వైద్యనిపుణులు ,దంత వైద్య నిపుణులు,చిన్న పిల్లల వైద్య నిపుణులు సాధారణ వైద్య నిపుణులు,కంటి వైద్య నిపుణులు,పాల్గొని చికిత్సలు నిర్వహించారు . శిబిరాన్ని జిల్లా వైద్య ఆరోగ్యశాఖ అధికారి డాక్టర్ రవి నాయక్ పాల్గొని పరిశీలించారని ఆమె తెలిపారు .ఆయా శాఖలకు సంబంధించిన వైద్యులు రోగులను పరీక్షించి మందులు అందించడం జరిగింది. అదేవిధంగా శస్త్ర చికిత్స అవసరం ఉన్నవారిని గుర్తించి నాగర్ కర్నూల్ జిల్లా ప్రభుత్వ జనరల్ ఆసుపత్రికి పంపించడం చేయడం జరిగిందని తెలిపారు. ఈ మెగా వైద్య శిబిరంలో 210 మందిని వైద్యులు పరీక్షించిచారని డాక్టర్ నాగేశ్వరీ తెలిపారు. ఈ కార్యక్రమంలో బొప్పల్లి సర్పంచ్ మహేశ్వరం నవ్య మల్లాచారి. బొప్పల్లి పంచాయతీ కార్యదర్శి ఈశ్వర్.ఆలేర్ సర్పంచ్ తగిలి ఆనంద్. నాగర్ కర్నూల్ మార్కెట్ కమిటీ డైరెక్టర్ అల్వాల తిరుపతయ్య. బొప్పల్లి ఉపసర్పంచ్ గౌరారం రాజు,వార్డు సభ్యులు. అల్వాల స్వప్న సుల్తాన్, మరియు సురేష్.శ్రీను అనిత.ఎల్లమ్మ. మమత.ఆలేర్ వార్డు సభ్యులు సురేష్,శ్రీకాంత్. గ్రామ పెద్దలు మోహన్ రెడ్డి ,సోడే నర్సింహ్మ, తంగెళ్ల అంజనేయులు,బీగాళ్ళ మల్లేష్,పులి మామిడి మల్లేష్.ప్రవీన్,బొప్పల్లి ప్రాథమిక ఆరోగ్య కేంద్ర వైద్యులు డాక్టర్ నర్మద సూపర్ వైజర్లు రవి విందర్ రెడ్డి. సరళ.ల్యాబ్ టెక్నికల్ శ్రీధర్ రెడ్డి.ఎం ల్ హెచ్ పి లు .ఏఎన్ఎం నిరంజనమ్మ మరియు ఆశా కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.