మానవాళి మనుగడకు ఇబ్బందికరంగా మారే ప్లాస్టిక్ ను నివారిద్దాం

జిల్లా పంచాయతీరాజ్ అధికారి(డీపీవో ) రాంబాబు కల్లూరు (డీ యల్ పి వో ) విజయలక్ష్మి

పయనించే సూర్యుడు న్యూస్ :మార్చి 26, తల్లాడ రిపోర్టర్ తల్లాడ… పంచాయతీరాజ్ గ్రామీణాభివృద్ధి శాఖ ఆధ్వర్యంలో గ్రామ పంచాయతీ వార్డు సభ్యుల శిక్షణ కార్యక్రమానికి విచ్చేసిన జిల్లా పంచాయతీరాజ్ అధికారి రాంబాబు శిక్షణ కార్యక్రమాన్ని ఉద్దేశించి మాట్లాడారు అనంతరం మల్లవరం మాజీ ఉపసర్పంచ్ ఎర్రు నరసింహారావు సతీమణి పద్మావతి తయారుచేసిన జ్యూట్ బ్యాగులను పరిశీలించి అనంతరం మాట్లాడుతూ గ్రామ పంచాయతీల్లో ప్లాస్టిక్ వాడకాన్ని కూడా నివారించి భవిష్యత్తులో పర్యావరణాన్ని పరిరక్షించే విధంగా సర్పంచులు వార్డు సభ్యులు ప్రజలు పర్యావరణ పరిరక్షణ కోసం ప్లాస్టిక్ వాడకాన్ని తగ్గించేలా ప్రజలలో చైతన్యం తీసుకురావాలని కోరారు భవిష్యత్తులో ఇదే రకంగా ప్లాస్టిక్ వాడకాన్ని తగ్గించకుండా ఉంటే మానవ మనుగడకే ప్రమాదం పొంచి ఉందని డిపిఓ రాంబాబు అన్నారు ఇప్పటికే ప్లాస్టిక్ వాడకంపై అనేక రకాల నిషేధాలు ఉన్నప్పటికీ ప్రజలు వాటి వాడకాన్ని తగ్గించకుండా వాడుతూనే ఉన్నారని ఇలాగే చేస్తే మానవ మనుగడకే ప్రమాదం పొంచి ఉన్నదని అందుకే ఇప్పటినుండి అయినా గ్రామాల్లో పట్టణాలలో ప్లాస్టిక్ వాడకాన్ని తగ్గించి జ్యూట్ మరియు ఇతర పర్యావరణ పరిరక్షణకు ఉపయోగపడే బ్యాగులను వాడాలని ఆయన కోరారు ప్రతిరోజు ఏదో ఒక అవసరం కోసం ప్లాస్టిక్ ని వాడుతూనే ఉన్నారు భవిష్యత్తులో అయినా ప్లాస్టిక్ వాడకాన్ని తగ్గించి జ్యూట్ మరియు ఇతర పర్యావరణ హాని కలిగించని క్యారీ బ్యాగులు వాడాలని సూచించారు ఇప్పటికే ప్రపంచ వైద్య ఆరోగ్య సంస్థ పర్యావరణ పరిరక్షణ కోసం హెచ్చరించిన నేపథ్యంలో భవిష్యత్తు తరాల మనుగడ కోసం ప్లాస్టిక్ వాడకాన్ని నిషేధించి జ్యూట్ ని మరింత పెంచాల్సిన అవసరం ఉందని అన్నారు. అనంతరం డిపిఓ రాంబాబు కల్లూరు డిఎల్పిఓ విజయలక్ష్మి కి మల్లవరం మాజీ ఉప సర్పంచ్ ఎర్రి నరసింహారావు జ్యూట్ ఫైల్ జ్యూట్ బ్యాగును ఇద్దరికీ బహుకరించారు ఈ కార్యక్రమంలో డిపిఓ వెంట కల్లూరు డి ఎల్ పి ఓ విజయలక్ష్మి మండల పరిషత్ అభివృద్ధి అధికారి ఏ శ్రీధర్ రాజు ఎంపీఓ సురేష్ బాబు తల్లాడ మేజర్ పంచాయతీ ఈవో కృష్ణారావు గ్రామపంచాయతీ సెక్రటరీలు గ్రామపంచాయతీ వార్డు సభ్యులు తదితరులు పాల్గొన్నారు