మియాపూర్లో అనుమతి లేకుండా అపార్ట్మెంట్ నిర్మాణం జరుగుతోంది జిహెచ్ఎంసి టౌన్ ప్లానింగ్ అధికారులు ఏం చేస్తున్నారు.

పయనించే సూర్యుడు, మార్చి 26 రంగారెడ్డిజిల్లాప్రతినిధి ఎస్ఎం కుమార్ శేరిలింగంపల్లి నియోజక వర్గం పరి ధిలోని గోకుల్ ప్లాట్స్ వెంకటరమ ణ కాలనీలో ప్లాట్ నెంబర్ 1148, 1149 ప్లాట్ లలో నిబంధనలకు విరుద్ధంగా జి+ప్లస్ 8 అంతస్తుల నిర్మాణం చేపడుతున్నారని స్థాని కులు ఆరోపిస్తున్నారు దీనిపై ఇప్ప టికి పోలీస్ స్టేషన్ ప్రజావాణి హైడ్రా ధికారు ఫిర్యాదు చేసిన ఎలాంటి ఫలితం లేదని ఆవేదన వ్యక్తం చే స్తున్నారు. నిరుపేదలు చిన్న గుడి చివేసిన కూచివేయడానికి ఆగమే ఘాల మీద దూసుకు వచ్చే టౌన్ ప్లానింగ్ అధికారులు ఈ విషయం లో నిమ్మకు నీరు ఎత్తినట్లు వ్యవ హరించడం తగదని ఈ ప్రాంతవా సులు వారి తీరుపై మండిపడుతు న్నారు. గత ఏడాది నుండి ఇప్పటి వరకు ఇలాంటి అనుమ తులు లేకుండా జరుగుతున్న నిర్మాణాలు ఎన్నో ఉన్నప్పటికీ టౌన్ ప్లానింగ్ సంబంధించిన అధికారులు వారికి కావలసిన ముడుపులని తీసుకొని ప్రభుత్వానికి రావలసిన పెద్ద ఎత్తు న గండి కొడుతున్నారని సందేహం లేదని ఈ ప్రాంత వాసులు ఆవేదన వ్యక్తం చేస్తు న్నారు.ఇప్పటికైనా ఈ భారీ నిర్మాణం వల్ల రహదారి సమ స్య లు తలెత్తుతున్నాయని నిబం ధన ఉల్లంఘించిన వారిపై తక్షణ మే కఠిన చర్యలు తీసుకోవాలని ఈ ప్రాంత నివాసితులు కోరుతు న్నారు.