పయనించే సూర్యుడు / మార్చి 26 / దిడ్డి రాము / జమ్మికుంట రూరల్; జమ్మికుంట పట్టణంలోని మేదరివాడ బస్టాండ్ వెనుక ప్రాంతంలో విద్యుత్ సరఫరాను మెరుగుపరిచేందుకు కీలక చర్యలు తీసుకోబడ్డాయి. ఇంతకు ముందు ఉన్న 100 కే.వి.ఎ ట్రాన్స్ఫార్మర్ను 160 కే.వి.ఎ సామర్థ్యంతో అప్గ్రేడ్ చేసి కొత్తగా ఫీడ్ చేయడం జరిగింది. ఈ మార్పు ద్వారా ముఖ్యంగా వేసవి కాలంలో ఎదురయ్యే విద్యుత్ అంతరాయాలను తగ్గించడమే ప్రధాన ఉద్దేశంగా విద్యుత్ శాఖ అధికారులు తెలిపారు. ఈ కార్యక్రమంలో అసిస్టెంట్ ఇంజినీర్ (ఏఈ)తో పాటు జమ్మికుంట వార్డ్ కౌన్సిలర్ చింతల శ్రీనివాస్ పాల్గొని ట్రాన్స్ఫార్మర్ను ప్రారంభించారు. ఈ అప్గ్రేడ్ వల్ల ఆ ప్రాంతంలో విద్యుత్ లోడును సులభంగా నిర్వహించగలగడం తో పాటు, తరచుగా జరిగే పవర్ కట్స్ సమస్యలు తగ్గే అవకాశముంది. ప్రస్తుతం పెరుగుతున్న ఉష్ణోగ్రతలు, వినియోగం దృష్ట్యా విద్యుత్ వ్యవస్థను బలోపేతం చేయడం అత్యవసరమైందని అధికారులు పేర్కొన్నారు. ఈ చర్యతో మేదరివాడ ప్రాంత ప్రజలకు మరింత నాణ్యమైన, నిరంతర విద్యుత్ సరఫరా అందుబాటులోకి రానుంది. స్థానిక ప్రజలు కూడా ఈ చర్యను స్వాగతిస్తూ విద్యుత్ శాఖకు కృతజ్ఞతలు తెలిపారు.