పయనించే సూర్యుడు 26-3-2026 గొల్లపెల్లి మండల రిపోర్టర్ (ఆవుల చందు ) జగిత్యాల జిల్లా గొల్లపల్లి మండల కేంద్రం లో బుధవారం రోజున హెల్త్ డిపార్ట్మెంట్ సహకారంతో టిబి (క్షయ )వ్యాధుల పైన అవగాహన కార్యక్రమం నిర్వహించడం జరిగింది. ఈ సందర్భంగా అవగాహన పోస్టర్‌ను ఆవిష్కరించి, ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో విద్యార్థులకు టీబి వ్యాధి పై అవగాహన కల్పించారు. సుపరింటెండెంట్ డాక్టర్ శ్రీకాంత్ మాట్లాడుతూ టీబీ లక్షణాలు, నివారణ గురించి వివరించరు, సమయానికి పరీక్షలు చేయించుకోవాలని సూచించారు, టీబీ నీ నివారించవచ్చు అని , టీవీ రహిత సమాజం కోసం అందరూ పాటుపడాలని పిలుపునిచ్చారు. యూత్ చేపడుతున్న ఇలాంటి కార్యక్రమాలు అభినందనీయమని తెలిపారు. స్కూల్ ప్రిన్సిపల్ అనిత మాట్లాడుతూ చిన్న వయసు నుంచే ఆరోగ్యంపై అవగాహన అవసరమని, ఇలాంటి కార్యక్రమాలు కొనసాగించాలని సూచిస్తూ యూత్ ను అభినందించారు. ఈ కార్యక్రమంలో ఎల్పుల రాము, బోడపట్ల రాజ్ కుమార్, కాల్వ మధుకర్,ఎనగందుల గణేష్, తమ్మనవేని సంతోష్,బక్కశెట్టి లవన్..లు పాల్గొన్నారు