రాష్ట్ర స్థాయి పరుగు పందెంలో ప్రతిభ కనబరిచిన నిరంజనమ్మకు ఘన సన్మానం.

సన్మానించిన సర్పంచ్ వారి బృందం.

పయనించే సూర్యుడు. మార్చి 26.నాగర్ కర్నూల్ జిల్లా. తెల్కపల్లి మండలం రిపోర్టర్ :సుల్తాన్, నాగర్ కర్నూల్ జిల్లా తెల్కపల్లి మండలంబొప్పల్లి గ్రామానికి చెందిన ఏఎన్ఎం నిరంజనమ్మ రాష్ట్ర స్థాయి పరుగు పందెంలో పాల్గొని ప్రతిభ కనబరిన ఆలేరు ఏఎన్ఎం నిరంజనమ్మ ను బొప్పెల్లి సర్పంచ్ మహేశ్వరం నవ్య మల్లాచారి.గ్రామ ఉప సర్పంచ్ వార్డు సభ్యుల తో కలిసి శాలువా కప్పి ఘనంగా సన్మానించారు. తమ గ్రామానికి చెందిన మహిళా నిరంజనమ్మ ఈనెల 15న హన్మకొండ జవహర్ లాల్ నెహ్రు స్టేడియంలో జరిగిన 400 మీటర్ల పరుగు పందెంలో పాల్గొని ప్రతిభ కనబర్చండం చాలా సంతోషంగా ఉందని ఇలాంటి మరెన్నో పోటీలలో పాల్గొని ప్రతిభ కనబర్చాలని ఆమే ఆకాంక్షించారు.ఈ కార్యక్రమంలో ఉపసర్పంచ్ గౌరారం రాజు వార్డు సభ్యులు శ్రీను .సురేష్.అనిత.స్వప్న,గ్రామ పంచాయతీ కార్యదర్శి ఈశ్వర్ డాక్టర్ నాగేశ్వరీ.నర్మద సూపర్ వైజర్లు రవిందర్ రెడ్డి.సరళ ఎం ఎల్ హెచ్ పి లు మమత రామాంజనేయులు, ఏఎన్ఎంలు ఆశా కార్యకర్తలు గ్రామ పెద్దలు తదితరులు పాల్గొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *