పయనించే సూర్యుడు సామల రామకృష్ణ నేలకొండపల్లి మండల కేంద్రం మార్చి..2 6..2026… రిపోర్టర్ నేలకొండపల్లి మండల కేంద్రం లో ఇటీవల అనారోగ్యంతో మరణించిన వాకా రంగయ్య కుటుంబ సభ్యులను రెవెన్యూ, గృహనిర్మాణం, సమాచార శాఖ మంత్రి వర్యులు పొంగులేటి శ్రీనివాసరెడ్డి గారి క్యాంపు కార్యాలయం ఇంచార్జి తుంబూరి దయాకర్ రెడ్డి పరామర్శించారు. ముందుగా ఆయన చిత్ర పటానికి పూలమాల వేసి నివాళులర్పించారు. అనంతరం కుటుంబ సభ్యులను ఓదార్చి అండగా ఉంటామని ధైర్యం చెప్పారు. ఈ కార్యక్రమంలో నేలకొండపల్లి వ్యవసాయ మార్కెట్ చైర్మన్ వెన్నపూసల సీతారాములు, కాంగ్రెస్ జిల్లా నాయకులు కొడాలి గోవింద రావు, జెర్రిపోతుల అంజని, బచ్చలకూరి నాగరాజు, బొడ్డు బొందయ్య, మామిడి వెంకన్న, రోహినాద్, వెంకటేశ్వర్లు తదితరులు పాల్గొన్నారు