పయనించే సూర్యుడు మార్చి 26 ఉట్నూర్ మండలం రిపోర్టర్ షైక్ సోహెల్ పాషా ఉట్నూర్: గిరిజన విద్యార్థుల్లో ఆంగ్ల భాషా ప్రావీణ్యాన్ని అభివృద్ధి చేయడానికి నిర్వహిస్తున్న వర్డ్ ఫర్ ఛాంపియన్షిప్ పోటీలు అత్యంత ప్రయోజనకరమని ఐటీడీఏ ప్రాజెక్టు అధికారి యువరాజ్ మార్మాట్ తేలిపారు ఉట్నూర్ విభాగం ఆధ్వర్యంలో నిర్వహించిన ఈ పోటీల కార్యక్రమానికి ఆయన ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా పీవో మాట్లాడుతూ.. గిరిజన విద్యార్థుల్లో ఆత్మవిశ్వాసం పెంపొందించడమే కాకుండా పదసంపద విస్తరణ పఠన నైపుణ్యాల మెరుగుదల వంటి అంశాల్లో ఈ పోటీలు కీలక పాత్ర పోషిస్తాయని పేర్కొన్నారు విద్యార్థులు విద్యారంగంలో మెరుగైన ఫలితాలు సాధించేందుకు ఇటువంటి ప్రత్యేక కార్యక్రమాలు దోహదపడతాయని తెలిపారు విద్యార్థులు అందుబాటులో ఉన్న అవకాశాలను సద్వినియోగం చేసుకుని ఉన్నత లక్ష్యాలను సాధించాలని భవిష్యత్తులో మరిన్ని విజయాలు అందుకోవాలని ఆకాంక్షించారు.