శాంతియుతంగా శ్రీరామనవమి వేడుకలు జరుపుకోవాలి

ఎస్ఐ గుంపుల విజయ్

పయనించే సూర్యుడు మార్చి 26 ఉట్నూర్ మండలం రిపోర్టర్ షైక్ సోహెల్ పాషా ఉట్నూర్: ఉట్నూర్ లో రాబోయే శ్రీరామ నవమి హనుమాన్ జయంతి ఉత్సవాలను ప్రశాంత వాతావరణంలో నిర్వహించుకోవాలని ఉట్నూర్ ఎస్ఐ గుంపుల విజయ్ సూచించారు బుధవారం ఉత్సవ కమిటీ సభ్యులతో జరిగిన సమావేశంలో ఆయన మాట్లాడారు భక్తి శ్రద్ధలతో నిర్వహించే ఈ కార్యక్రమాలు ఇతరులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా జాగ్రత్తలు తీసుకోవాలన్నారు శబ్ద కాలుష్యం ట్రాఫిక్ నియంత్రణ వంటి అంశాల్లో ప్రభుత్వం నిర్దేశించిన మార్గదర్శకాలను తప్పనిసరిగా పాటించాలని పేర్కొన్నారు సామరస్య వాతావరణాన్ని కాపాడుతూ.. అధికారులకు పూర్తి సహకారం అందించాలని ఆయన కోరారు సమస్యలు తలెత్తకుండా ముందస్తు చర్యలు తీసుకోవాలని నిర్వాహకులకు సూచించారు.