
పయనించే సూర్యుడు మార్చి 26 రిపోర్టర్ కామని ప్రమోద్ వరంగల్ జిల్లా నర్సంపేట నియోజకవర్గం ఖానాపూరం మండల కేంద్రం ఖానాపురం రామాలయంలో మొదలైన కళ్యాణ మహోత్సవ కార్యక్రమాలు నిన్న పసుపు దంచుట నేడు కళ్యాణ పందిరి కార్యక్రమం. వేడుకల్లో పాల్గొన్న సర్పంచ్ దాసరి రమేష్ గ్రామ పెద్దలు భక్తులు. ఆలయ ప్రధాన అర్చకులు పర్వతపు శివప్రసాద్ శాస్త్రి ఆధ్వర్యంలో పూజా కార్యక్రమాలతో మొదలైన కళ్యాణ మహోత్సవ పనులు ఖానాపురం మండల కేంద్రంలోని సీతారామచంద్రస్వామి ఆలయంలో శ్రీరామ నవమి పర్వదినాన్ని పురస్కరించుకొని శ్రీ సీతారామచంద్రస్వామి కళ్యాణ మహోత్సవం సందర్భంగా ఆలయ ప్రాంగణంలో ఆలయ ప్రధాన అర్చకులు శ్రీ పర్వతపు శివప్రసాద్ శాస్త్రి ఆధ్వర్యంలో పూజలు ప్రారంభించి నిన్న పసుపు దంచుట శ్రీరామ నవమి రోజు స్వామివారి కళ్యాణం సందర్భంగా నేడు స్వామివారి పెండ్లి పందిరికి సర్పంచ్ దాసరి రమేష్ గ్రామ పెద్దలు భక్తులు ప్రత్యేక పూజలు నిర్వహించి కార్యక్రమాన్ని పూర్తి చేశారు ఈ సందర్భంగా సర్పంచ్ రమేష్ మాట్లాడుతూ శ్రీరామ నవమి సందర్భంగా మన గ్రామంలోని శ్రీ సీతారామచంద్రస్వామి ఆలయంలో రాముల వారి కళ్యాణం వైభవంగా నిర్వహించడం జరుగుతుందని ఇట్టి కార్యక్రమానికి గ్రామస్తులు భక్తులు అధిక సంఖ్యలో పాల్గొని శ్రీ సీతారామచంద్ర స్వామి కృపకు పాత్రులు కాగలరని కోరారు ఈ కార్యక్రమంలో భక్తులు గ్రామ పెద్దలు పాల్గొన్నారు