శ్రీ కళ్యాణ రామ నూతన విగ్రహ ప్రతిష్ట మహోత్సవం అత్యంత భక్తిశ్రద్ధలతో, ఆధ్యాత్మిక ఉత్సాహం నడుమ ఘనంగా నిర్వహించబడింది.

పయనించే సూర్యుడు న్యూస్ : కడప మార్చి:26 శ్రీ కళ్యాణ రామ నూతన విగ్రహ ప్రతిష్ట మహోత్సవం మూడు రోజులపాటు అంగరంగ వైభవంగా నిర్వహించారు ఈ పుణ్యకార్యానికి ఎమ్మెల్సీ డీసీ గోవిందరెడ్డి హాజరయ్యారు గ్రామస్తులు పూర్ణకుంభంతో సాంప్రదాయబద్ధంగా స్వాగతం పలికారు. అనంతరం వేద పండితులు మంత్రోచ్ఛారణల మధ్య ప్రత్యేక పూజలు నిర్వహించి, ధ్వజస్తంభంవద్ద కొబ్బరికాయ కొట్టి దేవునికి నమస్కరించడం జరిగింది. ఈ కార్యక్రమం మొత్తం భక్తి పారవశ్యంతో నిండిపోయి, గ్రామం మొత్తం ఒక ఆధ్యాత్మిక క్షేత్రంలా మారింది. అనంతరం భక్తులకు తీర్థప్రసాదాలు పంపిణీ చేయగా, పాల్గొన్న ప్రతి ఒక్కరూ ఆనందభరితంగా ఆశీర్వాదాలు స్వీకరించారు. ఎమ్మెల్సీ డీసీ గోవిందరెడ్డి మాట్లాడుతూ, నాయనపల్లె గ్రామంలో సీతారాముల స్వామి దేవాలయ నిర్మాణానికి సహకరించిన ప్రతి గ్రామస్థుడికి, నాయకులకు హృదయపూర్వక ధన్యవాదాలు తెలిపారు. ఈ దేవాలయం నిర్మాణం నాయనపల్లి గ్రామం చిరకాల ఆకాంక్ష నెరవేరినట్లు ఆయన తెలిపారు అలాగే బద్వేల్ తెలుగుదేశ పార్టీ మాజీ ఎమ్మెల్యే, పార్టీ ఇంచార్జ్ విజయమ్మ రితీష్ రితీష్ కుమార్ రెడ్డి పూజలను నిర్వహించి వారిని శాలువాలతో సత్కరించారు ఆయన మాట్లాడుతూ ప్రజలు తమ ఆధ్యాత్మిక విశ్వాసాన్ని ప్రతిబింబించేలా దేవాలయం నిర్మించుకోవడం ఎంతో గొప్ప విషయమని కొనియాడారు. గ్రామస్తుల ఐక్యత, భక్తి, నిబద్ధత వల్లే ఈ మహోత్సవం విజయవంతమైందని అన్నారు. ఇలాంటి పుణ్యకార్యాలు సమాజంలో సానుకూలతను పెంచి, ప్రజల మధ్య ఐక్యతను మరింత బలపరుస్తాయని ఆయన పేర్కొన్నారు. చివరగా సీతారాముల కటాక్షం గ్రామ ప్రజలందరిపై ఎల్లప్పుడూ ఉండి, వారు ఆయురారోగ్యాలతో సుఖసంతోషాలతో వర్ధిల్లాలని ఆకాంక్షించారు. ఈ కార్యక్రమంలో నాయనపల్లి గ్రామం పెద్దలు ప్రజలు పెద్ద ఎత్తున భక్తులంతా అందరూ పాల్గొన్నారు

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *