పయనించే సూర్యుడు మాచారెడ్డి రిపోర్టర్ ఓబుల్ రెడ్డి మార్చి 26 శ్రీ లక్ష్మీ నరసింహ స్వామి దేవస్థానం చుక్కాపూర్ వద్ద జరుగుచున్న అభివృద్ధి పనులను చూసి ఆలయం వద్ద నిర్మించుచున్న కాలక్షేప ఆశీర్వచన మండపము లోనికి పైడి మధుసూదన్ రెడ్డి గంగమణి కామారెడ్డి మరియు భీమిడి చక్రధర్ రెడ్డి లావణ్య హైదరాబాద్ గార్లు తమ వంతు సహాయంగా సుమారు Rs 71000/-(డెబ్బై ఒక వేయి రూపాయల) విలువ చేసే టైల్స్ ను విరాళముగా ఆలయ చైర్మన్ శనిగరం కమలాకర్ రెడ్డి గారికి అందజేశారు ఇట్టి కార్యక్రమంలో చైర్మన్ కమలాకర్ రెడ్డి ఈవో ప్రభు రాంచంద్రం జూనియర్ అసిస్టెంట్ సంతోష్ కుమార్ ఆలయ అర్చకులు సిబ్బంది పాల్గొన్నారు అనంతరం దాతలను ఘనంగా సన్మానించి స్వామి వారి చిత్రపటాన్ని అందజేశారు