పయనించే సూర్యుడు మార్చి 26 పెద్ద శంకరంపేట్ మండలం మెదక్ జిల్లా రిపోర్టర్ జిన్నా అశోక్) ప్రధాన వక్తగా శ్రీ సరస్వతి విద్యాపీఠం విభాగ్ షైక్షనిక్ ప్రముఖ వెంకట్రామిరెడ్డి హాజరై మాట్లాడుతూ శ్రీ సరస్వతి శిశు మందిరాలు క్రమశిక్షణకు నిలయాలని వివరించారు విద్యతోపాటు దేశభక్తి క్రమశిక్షణ సేవా జాతీయ భావనతో కూడిన విద్యను శిశు మందిరాలలో అందించడం జరుగుతుందని వివరించారు అనంతరం పెద్ద శంకరంపేట ఎస్సై ప్రవీణ్ రెడ్డి మాట్లాడుతూ సంస్కృతి సంప్రదాయాలకు నిలయాలుగా శిశు మందిరాలు నిలుస్తాయని అన్నారు క్రమశిక్షణతో పాటు దేశభక్తి తో కూడిన విద్యను అందించడం అభినందనీయం అన్నారు ఈ కార్యక్రమంలో శంకరంపేట ఏఎస్ఐ సంగమేశ్వర్ ప్రబంధకారిణి సభ్యులు క్రాంతి లాల్ జంగం రాఘవులు మల్లేశం పున్నయ్య సాయిలు గాండ్ల సంగమేశ్వర్ ప్రధానాచార్యులు లక్ష్మీనారాయణ ఆచార్యులు జయంత్ రెడ్డి శ్రీనివాస్ మాతాజీలు అధిక సంఖ్యలో పోషకులు విద్యార్థులు పాల్గొన్నారు
