
పయనించే సూర్యుడు మార్చి 26 ఆదోని నియోజకవర్గం ప్రతినిధి బాలకృష్ణ. ఏఐటీయూసీ అధ్యక్షులుగా ఓబి నాగరాజు ఏఐటియుసి ఉపాధ్యక్షులుగా ఎం గిరి మల్లప్ప ఎఐటియుసి పట్టణ ప్రధాన కార్యదర్శిగా వైటి భీమేష్ ఎన్నుకోవడం జరిగింది.ఈ సమావేశానికి ముఖ్య అతిథులుగా ఏఐటీయూసీ జిల్లా అధ్యక్షులు కే అజయ్ బాబు మరియు ఏఐటియుసి జిల్లా సహాయ కార్యదర్శి ఓ బి నాగరాజు మరియు సిపిఐ సీనియర్ నాయకులు కే లక్ష్మారెడ్డి సిపిఐ జిల్లా కార్యవర్గ సభ్యులు సుదర్శన్ ఏఐటీయూసీ జిల్లా సమితి సభ్యులు కలుబావిరాజు శిక్షావలి లక్ష్మీనారాయణ తదితరులు ఈ సమావేశంలో పాల్గొన్నారు ఈ సమావేశానికి వైటి భీమేష్ అధ్యక్షత వహించడం జరిగింది ఈ సమావేశంలో జిల్లా అధ్యక్షులు కే అజయ్ బాబు మాట్లాడుతూ మాట్లాడుతూ బ్రిటిష్ సామ్రాజ్యవాదానికి వ్యతిరేకంగా భారతదేశ స్వతంత్రం కోసం పోరాటాలు చేసిన చరిత్ర కలిగిన జాతీయ కార్మిక సంఘం వారు కొనియాడారు. శ్రమకు తగ్గ వేతనం ఇవ్వాలని శ్రమ దోపిడీ లేని సమ సమాజం శ్రామిక రాజ్యం రావాలని లక్షలతో దేశ కార్మిక వర్గానికి యూనియన్లు పెట్టి కార్మిక హక్కుల కోసం అశేష త్యాగాలు చేసి యూనియన్లు ఏర్పాటు చేసేది మొదలుకొని సమ్మె హక్కు వరకు 44 కార్మిక చట్టాలను దేశ ఉద్యోగ కార్మిక కార్మికులకు తీసుకొచ్చినటువంటి ఘన చరిత్ర కలిగినటువంటి కార్మిక సంఘం వారు తెలిపారు. నేను కేంద్రం ఉన్నటువంటి బిజెపి ప్రభుత్వం రాష్ట్రంలో ఉన్నటువంటి కూటమి ప్రభుత్వం ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అనుసరిస్తున్నటువంటి కార్మిక వ్యతిరేక విధానాన్ని ఎండ కొడుతూ నాలుగు లేబర్ కూలర్ రద్దు చేయాలని 44 కార్మిక చట్టాలు అమలు చేయాలని ప్రభుత్వ రంగ సమస్యలను కొనసాగించాలని విశాఖకు ప్రైవేటీకరణను ఆపాలని అమాలి ఆటో కార్మికులకు సంక్షేమ బోర్డులు ఏర్పాటు చేయాలని భవన నిర్మాణ సంక్షేమ చట్టాన్ని పునరుద్ధరించి పెండింగ్లో ఉన్నటువంటి బకాయిలు వెంటనే విడుదల చేయాలి. అనంతరం ఏఐటీయూసీ కర్నూలు జిల్లా 21వ మాసభలు మార్చి 28 29వ తేదీల్లో ఆలూరు లో జరగనున్నాయని 28వ తేదీ ఆలూరు లో జరుగు వేలాదిమంది కార్మిక మహా ప్రదర్శనకు ఆదోని నుండి పెద్ద సంఖ్యలో ఉద్యోగులు కార్మికులు హాజరై విజయవంతం చేయాలని వారు పిలుపునిచ్చారు. అనంతరం ఆదోని పట్టణ ఏఐటీయూసీ నూతన కమిటీ ఎన్నుకోవడం జరిగింది. ఏఐటీయూసీ పట్టణ అధ్యక్షులుగా ఓబి నాగరాజు ఉపాధ్యక్షులుగా ఎం గిరిమలప్ప ఏఐటియుసి పట్టణ ప్రధాన కార్యదర్శిగా వైటి భీమేష్ ఎన్నుకోవడం జరిగింది. వీరితోపాటు 25 మంది తో కుడిన సమితి సమిసభ్యులు ఎన్నుకోవడం జరిగింది ఈ సమావేశంలో గంగన్న సోమన్న చిట్టిబాబు తదితరులు పాల్గొన్నారు.
