పయనించే సూర్యడు మర్చి .27.2026 గురువారం నాడు ఆదివాసి సంక్షేమ పరిషత్ ఆధ్వర్యంలో రాజవొమ్మంగి మండల తాసిల్దార్,ఎంపీడీవో,మరియు విద్యుత్ శాఖ అధికారులకు.వినతి పత్రం అందజేయడం జరిగింది.ఈ సందర్భంగా ఆదివాసి సంక్షేమ పరిషత్ డివిజన్.కోఆర్డినేటర్ పీఠా ప్రసాద్ మాట్లాడుతూ రాజవొమ్మంగి మండలంలో నాన్ ట్రైబల్స్ అక్రమ కట్టడాలు త్వరగా కూల్చాలని,నాన్ ట్రైబల్స్ కి జారీ చేసిన విద్యుత్ మీటర్లు తక్షణమే తొలగించాలని,కొత్తగా ఎటువంటి విద్యుత్ మీటర్లు జారీ చేయవద్దని ఆయన మండల తాసిల్దార్,ఎంపీడీవో,మరియు విద్యుత్ శాఖ అధికారులను కోరడం జరిగింది.మండలంలో విచ్చలవిడిగా అక్రమ కట్టడాలు కట్టి ఉన్నారని,గతంలో చాలా అక్రమ కట్టడాలు గుర్తించి ఉన్నారు.అటువంటి అక్రమ కట్టడాలను తక్షణమే తొలగించాలని ఆయన అన్నారు.ఏజెన్సీ ప్రాంతాల్లో 1/70 చట్టాన్ని ఉల్లంఘించి నాన్ ట్రైబల్స్ కి విద్యుత్ మీటర్లు జారీ చేయడం.వల్ల వారు సులభంగా వ్యాపారాలు చేయగలుగుతున్నారని, ఏజెన్సీ నిబంధనల ప్రకారం నాన్ ట్రైబల్స్ కి విద్యుత్ మీటర్లు నిలుపుదల చేస్తే ఏజెన్సీ లో ఎటువంటి నాన్ ట్రైబల్స్ వలసలు ఉండవని ఆయన అభిప్రాయపడ్డారు.ఐదో షెడ్యూల్ ప్రాంతాల్లో రాజ్యాంగం ఆదివాసులకు కల్పించిన ప్రత్యేక చట్టాలను పటిష్టంగా అమలు చేయకపోవడం వలన ఆదివాసులు తమ భూములను కోల్పోతున్నారని,సొంత గడ్డపై ద్వితీయ శ్రేణి పౌరులుగా బతకాల్సి వస్తుందని,బయట ప్రాంతాన్ని నుంచి వచ్చిన వారు ఎదేచ్చగా అక్రమ వ్యాపారాలు చేసుకుంటూ,అక్రమ నిర్మాణాలు చేసుకుంటూ ఆదివాసీలను అణగదొక్కుతున్నారని ఆయన ఆవేదన వ్యక్తపరిచారు.ఏజెన్సీ చట్టాల అమలు విషయంలో ప్రభుత్వాలు సిద్ధ శుద్ధి చూపించాలని ఏజెన్సీ ప్రజాప్రతినిధులు ఏజెన్సీ చట్టాల అమలకు పాటుపడాలని ఆయన డిమాండ్ చేశారు.ఈ కార్యక్రమంలో ఆయనతోపాటు ఆదివాసి సంక్షేమ పరిషత్ రాజవోమంగి మండల కమిటీ సభ్యులు పాల్గొన్నారు.పీఠా ప్రసాద్ ఆదివాసి సంక్షేమ పరిషత్ రంపచోడవరం డివిజన్ కోఆర్డినేటర్.