ఆంధ్రప్రదేశ్ అభివృద్ధికి మైలురాయిగా ఆర్సెలర్ మిట్టల్ స్టీల్ ప్లాంట్

మంత్రాలయం టీడీపీ ఇన్‌చార్జ్ రాఘవేంద్ర రెడ్డి తెలిపారు

పయనించే సూర్యుడు న్యూస్ మార్చి 27 రిపోర్టర్ అభి ఆంధ్రప్రదేశ్ పారిశ్రామిక అభివృద్ధికి కీలకంగా నిలిచే ప్రాజెక్ట్‌గా ఆర్సెలర్ మిట్టల్ స్టీల్ ప్లాంట్ ఉండనుందని మంత్రాలయం టీడీపీ ఇన్‌చార్జ్ రాఘవేంద్ర రెడ్డి తెలిపారు. ఈ ప్రాజెక్ట్ సుమారు రూ.1.35 లక్షల కోట్ల పెట్టుబడితో ఏర్పడి రాష్ట్ర ఆర్థిక వ్యవస్థకు కొత్త ఊపిరి పోస్తుందని పేర్కొన్నారు. ప్రత్యక్షంగా, పరోక్షంగా లక్షలాది ఉద్యోగ అవకాశాలు కల్పించబడనున్నాయని అన్నారు. “జాబ్స్ ఫస్ట్” విధానంతో ప్రభుత్వం పరిశ్రమలను ఆకర్షిస్తోందని, పారదర్శక విధానాలు, వేగవంతమైన అనుమతుల వల్ల ప్రపంచ స్థాయి కంపెనీలు రాష్ట్రానికి వస్తున్నాయని తెలిపారు. సుమారు 5,465 ఎకరాల్లో ఏర్పడనున్న ఈ ప్లాంట్ దశల వారీగా అభివృద్ధి చెందుతూ, 2030 నాటికి పూర్తి స్థాయిలో కార్యకలాపాలు ప్రారంభించనుందని వెల్లడించారు. ఈ ప్రాజెక్ట్ ద్వారా అనుబంధ పరిశ్రమలు, MSMEలు, రవాణా రంగాలు కూడా అభివృద్ధి చెందుతాయని చెప్పారు. రాష్ట్రాన్ని పారిశ్రామిక హబ్‌గా మార్చే దిశగా ఈ స్టీల్ ప్లాంట్ మైలురాయిగా నిలుస్తుందని రాఘవేంద్ర రెడ్డి పేర్కొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *