పయనించే సూర్యుడు మార్చి 27 ఆదోని డివిజన్ ఇంచార్జ్ గుమ్మల బాలస్వామి ప్రజాదర్బార్ కార్యక్రమంలో రైతుల భూములు కబ్జా చేసిన వారిని ఉద్దేశించి ఎమ్మెల్యే డాక్టర్ పార్థసారథి వాల్మీకి అన్నారు. క్యాంపు కార్యాలయం ఏర్పాటు చేసిన ప్రజాదర్బార్ కార్యక్రమంలో నియోజకవర్గ ప్రజలు వారి సమస్యలు విన్నవించుకునేందుకు ఈ కార్యక్రమంలో పాల్గొని సమస్యలు ఎమ్మెల్యే పార్థసారథి దృష్టికి తీసుకువచ్చారు, ఎమ్మెల్యే ప్రతి సమస్యను వింటూ సంబంధిత అధికారులను వెంటనే ఆ సమస్యపై వివరణ ఇచ్చే విధంగా మాట్లాడి త్వరితగతిన ప్రతి సమస్య పరిష్కారం అయ్యే విధంగా చర్యలు చేపడుతామని తెలియజేశారు ముఖ్యంగా గురువారం వచ్చిన సమస్యలలో ఎక్కువ శాతం భూ సమస్యలు.కబ్జాలు ,రౌడీయిజం ఇంటి పట్టాల కోరకు లాంటి సమస్యలు రావడంతో ఎమ్మెల్యే పార్థసారథి మాట్లాడుతూ గత ప్రభుత్వంలో భూకబ్జాలు చేసి ప్రజలను పీడించుకుని తిన్న పాపం పండి ఎన్నికల్లో ఓడిపోయి ఇంట్లో కూర్చున్న వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ నాయకులు ఇంకా ఇప్పుడు కూడా కబ్జా చేయడానికి ప్రయత్నిస్తున్నారని ఇలాంటి కార్యక్రమాలు చేయాలని చూస్తే సహించేది లేదని తెలియజేశారు. కార్యక్రమంలో మునిసిపల్ కమీషనర్,ఎంపీడీఓ,ఎంఈఓ1, అసెంబ్లీ లోని అన్ని ప్రభుత్వ విభాగాలఅధికారులు ,బీజేపీ ,టీడీపీ ,జనసేన నాయకులు పాల్గొన్నారు