పయనించే సూర్యుడు మార్చి 27 ఆదోని డివిజన్ ఇంచార్జ్ గుమ్మల బాలస్వామి గురువారం మధ్యాహ్నం 03.30 గంటల కాలం అప్పుడు ముద్దాయి వేణుగోపాల్, వయస్సు 35 సంవత్సరాలు తండ్రి శంకరప్ప గౌడ్,కపటి గ్రామము కు చెందిన వ్యక్తిని చాగి బస్టాండ్, ఆదోని మండలం వద్ద అరెస్టు చేయడమైనది. ఇతడు 18.02.2026 న రాత్రి తన తండ్రి అయిన శంకరప్ప గౌడు ను, ఆస్తి పంచి ఇవ్వలేదని అతని చంపాలని ఉద్దేశంతో కత్తితో దాడి చేసి గాయపరిచి అడ్డువచ్చిన తల్లిపై కూడా దాడి చేసి, తండ్రి యొక్క మెడలోని గొలుసు అతని యొక్క బుల్లెట్ బైక్, సెల్ ఫోన్ ని తీసుకొని పారిపోయాడు తర్వాత తన తండ్రి సెల్ నుండి ఫోన్ పే ద్వారా రెండు లక్ష రూపాయలు తన అకౌంట్ లోకి ట్రాన్స్ఫర్ చేసుకోవడం జరిగింది. ఈ రోజు ముద్దాయిని అరెస్ట్ చేసి అతని నుంచి ఆ చైన్ ని, 1,92,000 రూపాయల, బుల్లెట్, మోటార్ బైక్ ని స్వాధీనం చేసుకుని రిమాండ్కు పంపడమైనది.
