ఇరగాయి పంచాయితీ తోట వలస గ్రామానికి సీసీ రోడ్డు నిర్మాణం చేసి రోడ్డు సమస్య పరిష్కారం చేయాలని సిపిఎం పార్టీ మండల కార్యదర్శి కిండంగి రామారావు పర్యటన చేసి సమస్యలు పరిష్కారం చేయాలని డిమాండ్ చేయడం జరిగింది.

పయనించే సూర్యుడు మార్చి తేదీ 27 రూలర్ ప్రతినిధి బాసు అల్లూరి సీతారాం జిల్లా అరకు నియోజవర్గ మండల కేంద్ర పరిధిలో ఇరా గాయి పంచాయితీ తోట వలస గ్రామానికి అనేక సంవత్సరాల కాలం నుండి రోడ్డు సౌకర్యం లేక తోట వలస గ్రామంలో ఉన్న డిపో నడపడం కష్టతరంగం మారిందని గ్రామస్తులు వాపోయారు. వర్షాకాలంలో డిఆర్ డిపో సరుకులు తీసుకెళ్లడానికి చాలా ఇబ్బంది పడుతున్నామని అన్నారు డిపోలో సరుకులు చేరాలంటే ఎన్నో కష్టాలు పడవలసి వస్తుందని అన్నారు. సుమారు ఒక కిలో మీటర్ వరకు మట్టి రోడ్డు ఉండడంతో వాహనదారులు ప్రయాణం చేయాలంటే కత్తి మీద సాముగా మారిందని అన్నారు. మా తోటవలస గ్రామంలో రోడ్డు సమస్యతో పాటు మంచినీరు సమస్య కూడా వెంటాడుతుంది అని అన్నారు వేసవి కాలం లో గ్రావిటీ నీరు ఇంకిపోయి గ్రామానికి నీటి సమస్య ఏర్పడుతుందన్నారు. ఇరగాయి గ్రామంలో ఎంపీపీ పాఠశాల లేక విద్యార్థులు చదువుకోవడానికి అనేక ఆటంకాలు ఎదుర్కొంటున్నారు. ఈ పాఠశాలలో సుమారు 25 మంది విద్యార్థిని విద్యార్థులు చదువుతున్నారు. ప్రభుత్వాల నిర్లక్ష్యం కారణంగా పేద విద్యార్థులులకు అందించవలసిన విద్య సౌకర్యాలు అందడం లేదు పేరు గొప్ప ఊరు దిబ్బ అన్న విధంగా ప్రచార ఆర్భాటానికి ప్రభుత్వం ప్రాధాన్యత ఇస్తుంది తప్ప మారుమూల ప్రాంతమైన ఇరగాయి పంచాయితీ ఇరగాయి గ్రామానికి పాఠశాల లేకపోవడం బాధాకరం ప్రభుత్వం నిర్మించి తలపెట్టిన సచివాలయం భవనం మండలంలో మొట్టమొదటగా శంకుస్థాపన చేసి నిర్మాణం చేపట్టడానికి పూనుకున్నారు కానీ ఈరోజు వరకు సచివాలయం భవనం నిర్మాణం కాలేదు మార్ముల ప్రాంత అభివృద్ధికి ప్రభుత్వం దృష్టి పెట్టకపోవడమే గ్రామాలకు రోడ్డు లేక ప్రభుత్వ భవనాలు లేక పాఠశాల భవనాలు లేక అభివృద్ధికి ఆమడ దూరంలో ఆదివాసి గిరిజనులు నివసిస్తున్నారు. ఇరగాయి తోట వలస గ్రామానికి రోడ్డు సౌకర్యం కల్పించి పంచాయతీ కేంద్రమైన ఇరగాయి గ్రామానికి పాఠశాల భవనం సచివాలయం భవనం పూర్తి చేయాలని ఈ సందర్భంగా డిమాండ్ చేయడం జరుగుతుంది. ఈ కార్యక్రమానికి గ్రామస్తులు సూకురు మల్లేష్ ,కన్నయ్య, చిన్నారావు, ఎస్ .రామారావు తదితరులు పాల్గొన్నారు.