ఉడుగుల కుంట తండాలో పశువులకు గాలికుంటు టీకాల కార్యక్రమం

కార్యక్రమంలో సర్పంచ్ బుజ్జి చందులాల్ పశువైద్య డాక్టర్ జీవిత. జ్యోతి

పయనించే సూర్యుడు మార్చి 27 నాగర్ కర్నూలు జిల్లా బిజినపల్లి రిపోర్టర్ కే శ్రావణ్ కుమార్ బిజినపల్లి మండలంలోని ఉడుగుల కుంట తండా గ్రామపంచాయతీ పరిధిలో సర్పంచ్ బుజ్జి చందులాల్ ఆధ్వర్యంలో పశువులకు గాలికుంటు వ్యాధి నివారణ కోసం టీకా ల కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆవులు, ఎద్దులు, గేదెలకు మొత్తం 76 టీకాలు వేశారు. ఈ సందర్భంగా సర్పంచ్ బుజ్జి చందులాల్ మాట్లాడుతూ పశుపోషకులు తమ పశువులకు తప్పనిసరిగా గాలికుంటు టీకాలు వేయించి వ్యాధి నుంచి రక్షించుకోవాలని సూచించారు. ఈ కార్యక్రమంలో పశువైద్య డాక్టర్ జీవిత, జ్యోతి, అజముద్దీన్, వెంకటస్వామి, ఎండి అన్వర్, సంబంధిత అధికారులు మరియు రైతులు పాల్గొన్నారు.