ఎరిగేరి గ్రామానికి ఎస్సీ కమిషన్ సభ్యుడు పర్యటన

పయనించే సూర్యుడు న్యూస్ మార్చి 27 రిపోర్టర్ అభి కర్నూలు రాష్ట్ర ఎస్సీ కమిషన్ సభ్యుడు మేకల బిక్షం ఈ నెల 28న కౌతాళం మండలం ఎరిగేరి గ్రామాన్ని సందర్శించనున్నట్లు దళిత సంఘాలు వెల్లడించాయి. మూడు నెలల క్రితం అత్యాచారం, హత్యకు గురైన దళిత మహిళ జానకి కుటుంబాన్ని పరామర్శించి వారికి భరోసా కల్పించనున్నారు. అనంతరం గ్రామంలో డా. బి.ఆర్. అంబేద్కర్, బాబు జగ్జీవన్ రామ్ యూత్ ఆధ్వర్యంలో మేకల బిక్షం గారికి అభినందన సభ, సన్మాన కార్యక్రమం నిర్వహించనున్నారు. ఈ సందర్భంగా ఆయన దళితుల సమస్యలపై గ్రీవెన్స్ కార్యక్రమం నిర్వహించి ప్రజల నుంచి అర్జీలు స్వీకరించనున్నారు. కార్యక్రమానికి నియోజకవర్గంలోని ప్రజలు, దళిత సంఘాల నాయకులు, కార్యకర్తలు పెద్ద ఎత్తున పాల్గొని విజయవంతం చేయాలని నిర్వాహకులు పిలుపునిచ్చారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *