కంటి శిబిరంలో 86 మందికి పరీక్షలు, 41 మందికి కంటి ఆపరేషన్లు .

అందత్వ ప్రోగ్రాం అధికారి డాక్టర్ హెచ్ ప్రదీప్

పయనించే సూర్యుడు మార్చి 27 నాగర్ కర్నూల్ జిల్లా బిజినపల్లి రిపోర్టర్ కే శ్రావణ్ కుమార్ జిల్లా వైద్య ఆరోగ్యశాఖ ద్వారా గురువారంనాడు పాత కలెక్టరేట్ భవనం 102 గది లో నిర్వహించిన కంటి చికిత్స శిబిరం విజయవంతమైనట్లు నాగర్ కర్నూల్ జిల్లా అందత్వ ప్రోగ్రాం అధికారి డాక్టర్ హెచ్.ప్రదీప్ తెలిపారు.ఈ శిబిరంలో జిల్లాలోని వివిధ ప్రాంతాల నుండి వచ్చిన86 మందికి కంటి పరీక్షలు నిర్వహించగా, అందులో అర్హులైన క్యాటరాక్ట్ పొరగల 41 మందిని గుర్తించి ప్రత్యేక అంబులెన్స్ లో లయన్ రాంరెడ్డి కంటి ఆసుపత్రికి పంపినట్లు ఆయన తెలిపారు. రోగులకు ఆప్తాలమిక్ అధికారి కోట్ర బాలాజీ ప్రత్యేక కంటి పరీక్షలు నిర్వహించారు.ఈ కార్యక్రమంలో వైద్య ఆరోగ్య సిబ్బంది వై. శ్రీనివాసులు, సుకుమార్ రెడ్డి,నరసింహ, చెన్నకేశవులు,ప్రకాష్, సురేష్,ఎన్.వెంకటేశ్వర చారి,సురేష్ చారి, కళ్యాణ్,సురేష్ కుమార్ తదితరులు పాల్గొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *