‌కంభం మండలంలోని సర్పంచులకు సన్మాన కార్యక్రమం

పయనించే సూర్యుడు, మార్చి 27 కంభం రిపోర్టర్ కే ఆనందబాబు (మైకేల్) కంభం మండలంలోని కందులాపురం సెంటర్ నందు మండలంలోని సర్పంచులకు ఐదు సంవత్సరాలు పదవి కాలం పూర్తి చేసుకున్న సందర్భంగా మాజీ ఎమ్మెల్యే గిద్దలూరు వైసిపి ఇన్చార్జ్ శ్రీ కుందూరు నాగార్జున రెడ్డి సర్పంచులకు సన్మానం చేశారు. ఈ కార్యక్రమంలో కందులాపురం సర్పంచ్ బత్తుల తిరుపాలమ్మ, రావిపాడు సర్పంచ్ భువనేశ్వరి, జంగంగుంట్ల సర్పంచ్ సుజాత, దర్గా సర్పంచి వెంకట రంగమ్మ, ఎర్రబాలెం సర్పంచ్ శ్రీధర్, చిన్న కంభం సర్పంచ్ రసూల్, ఎల్ కోట సర్పంచ్ భాష,హజరత్ గూడెం సర్పంచ్ మహబూబ్ పీరా,మండల అధ్యక్షుడు గొంగటి చెన్నారెడ్డి ,రాష్ట్ర యువత విభాగ కార్యదర్శి చెన్నారెడ్డి మరియు ఎంపీపీ చెగిరెడ్డి తులసమ్మ, వైస్ ఎంపీపీ రామ్మూర్తి ,ఆసియా ఎంపీటీసీలు మండల నాయకులు పాల్గొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *