గ్రామాలలో బెల్టు షాపులను అరికట్టాలి

సిపిఎం జిల్లా కమిటీ సభ్యులు గుంపల్లి అశోక్

పయనించే సూర్యుడు మార్చి 27 నాగర్ కర్నూల్ జిల్లా బిజినపల్లి రిపోర్టర్ కే శ్రావణ్ కుమార్ బిజినపల్లి మండలంలో గ్రామ గ్రామాన విచ్చలవిడిగా బెల్ట్ షాపుల ద్వారా మద్యాన్ని అమ్ముతున్నారని ఈ బెల్ట్ షాపుల అరికట్టాలని సిపిఎం జిల్లా కమిటీ సభ్యులు గుంపల్లి అశోక్ డిమాండ్ చేశారు గురువారం సిపిఎం సమావేశం జరిగింది ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ గ్రామాలలో విచ్చలవిడిగా కల్తీ మద్యాన్ని బెల్ట్ షాపుల ద్వారా అమ్ముతుంటే మండల పోలీసులుగానే, ఎక్సైజ్ అధికారులు గానీ పట్టించుకోకపోవడం దుర్మార్గమని అన్నారు గ్రామాలలో వారిని ప్రశ్నిస్తే ఎవరికి ఇవ్వాల్సిన మామూలు వాళ్లకి ఇస్తున్నామని ఇలాగనే అమ్ముతామని అంటున్నారని అన్నారు ఎక్సైజ్ అధికారులు పోలీసు అధికారులు సంయుక్తంగా గ్రామాలలో బెల్టు షాపులపై దాడులు నిర్వహించాలని విజ్ఞప్తి చేశారు కల్తీ మద్యం ద్వారా గ్రామాలలో ప్రాణాలు కోల్పోతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు ఈ కార్యక్రమంలో సిపిఎం నాయకులు చంద్రశేఖర్ మల్లేష్ మహేష్ తదితరులు ఉన్నారు