పయనించే సూర్యుడు 27-3-2026 గొల్లపల్లి మండల రిపోర్టర్ (ఆవుల చందు ) జగిత్యాల జిల్లా . జీవన్ రెడ్డి ఏ పార్టీలో ఉంటే మేము కూడా అదే పార్టీలో ఉంటాం. మాకు పలక బలపం పట్టించి అక్షరాలు నేర్పిన గురువు జీవన్ రెడ్డి. అతనికి పార్టీ లో జరిగిన అవమానం జీవన్ రెడ్డి ఒక్కడికే కాదు మొత్తం వ్యవస్థ కి అవమానం జరిగింది. అని మేము నమ్ముతున్నాం ఇంతకు ముందు ఎందరో రాజకీయ నాయకులు అహంకార పాలనతో మట్టిలో కలిసారో అందరికి తెలుసు మళ్ళీ అదే చరిత్ర పునః ప్రారంభం అవుతుంది ఏ ఐ సి సి ఆధ్వర్యంలో రాహుల్ గాంధీ ఆలోచన విధానం పాంచ్ న్యాయ్ ఆంటీ ప్రొటాక్షన్ లో భాగంగా పార్టీ పిరాయింపు అనే అంశం ఉంది ఒక పార్టీ లో గెలిచి ఇంకో పార్టీ లో పని చేసే ముందు గెలిచిన పార్టీ కి రాజీనామా చేసి రావాలని మానిపెస్టో లోనే పెట్టడం జరిగింది మరి అలాంటి కాంగ్రెస్ పార్టీ సిద్ధాంతం పక్కనపెట్టి వాళ్ళ ఇష్ట రాజ్యాంగ ఉంటూ మా జీవన్ రెడ్డి ని అవమానిస్తుంటే ఆయన చాలా ఓపిగ్గా భరించి సర్దుకు పోయారు చివరికి అవమానం భరించలేను అని పార్టీ కి రాజీనామా చేసారు. ఏది ఏమైనా మేము మా ఊహ తెలియని వయసు నుండి జీవన్ రెడ్డి తో ఉన్నాం ఇక ఎప్పటికి అయన తోనే ఉంటాం. జగిత్యాల అంటే జీవన్ రెడ్డి. జీవన్ రెడ్డి అంటే జగిత్యాల అనే నానుడి ఎప్పటి నుండో జనం లో ఉంది.తన పోరాటానికి తోడు గా జగిత్యాల ప్రజలు సిద్ధం గా ఉన్నారు మళ్ళీ జగిత్యాల జైత్రయాత్ర ప్రారంభం అవుతుంది.