
పయనించే సూర్యుడు మార్చి 27 రిపోర్టర్ కామని ప్రమోద్ వరంగల్ జిల్లా నర్సంపేట నియోజకవర్గం ఖానాపూర్ మండల కేంద్రం ఉచిత కంటి శిబిరంలో 66 మంది పరీక్షలు చేసుకోగా 27 మంది ఆపరేషన్లకు ఎంపిక కృతజ్ఞతలు తెలిపిన ప్రజలు ఖానాపురం మండల కేంద్రంలో గ్రామపంచాయతీ ఆవరణలో సర్పంచ్ దాసరి రమేష్ ఆధ్వర్యంలో ఉచిత కంటి శిబిరాన్ని శంకర కంటి ఆసుపత్రి వారు నిర్వహించగా సర్పంచ్ దాసరి రమేష్ ఉప సర్పంచ్ వార్డు సభ్యులు గ్రామ పెద్దలతో కలిసి జ్యోతి ప్రజ్వలన చేసి ప్రారంభించారు ఈ సందర్భంగా సర్పంచ్ రమేష్ మాట్లాడుతూ ఖానాపురం మండల కేంద్రంలో ఉచిత కంటి వైద్య శిబిరాన్ని ప్రగతి స్వచ్ఛంద సేవా సంస్థ సహకారంతో శంకర కంటి దవాఖాన వారు నిర్వహించే కార్యక్రమం మంచిదని అన్నారు మధ్యతరగతి మరియు ఆర్థిక స్తోమత లేని వారికి నాణ్యమైన అన్ని రకాల కంటి చికిత్సలను డాక్టర్లు పరిశీలించి కంటిచూపుతో బాధపడుతున్న వారికి సలహాలు సూచనలు ఇవ్వాలని అన్నారు ఖానాపురం తో పాటుగా చుట్టుపక్కల గ్రామాల ప్రజలు కంటి సమస్యలతో బాధపడుతున్న వారికి ఉచితంగా పరీక్షలు చేసి శంకర కంటి దవఖాన వారే స్వయంగా ప్రయాణ చార్జీలు భోజన సౌకర్యం కల్పించి ఆపరేషన్లు చేయడం పేద ప్రజలకు ఎంతో లాభదాయకమని అన్నారు ఇప్పటి నుండి ప్రతి నెలలో ఒక్కసారి గ్రామంలో ఉచిత కంటి వైద్య శిబిరం ఏర్పాటు చేయడం జరుగుతుందని దీనిని గ్రామస్తులు చుట్టుపక్కల గ్రామాల ప్రజలు సద్వినియోగం చేసుకోవాలని సూచించారు ఈ కార్యక్రమంలో పంచాయతీ కార్యదర్శి సుప్రజ ఉపసర్పంచ్ ఉప్పు రాజు వార్డు సభ్యులు గుండ్లపల్లి విజయ్ వేములపల్లి వెంకట ప్రసాద్ రావు మహమ్మద్ అజహర్ మాజీ ఎంపీపీ వేములపల్లి ప్రకాష్ రావు మాజీ సర్పంచ్ పరుచూరి సుబ్బారావు నాయకులు మచ్చిక అశోక్ మర్రి రామస్వామి గంగాపురం రమేష్ భూక్య నవీన్ జటంగి మహేష్ బిక్షం పోషాలు శంకర కంటి ఆసుపత్రి డాక్టర్లు సిబ్బంది ప్రగతి స్వచ్ఛంద సంస్థ ప్రతినిధులు పాల్గొన్నారు