తీవ్ర రక్తహీనతతో బాధపడుతున్న మహిళకు యువకుడి రక్తదానం

బ్రదర్స్ హ్యూమానిటీ ఫౌండేషన్ సమన్వయంతో ప్రాణదానం

పయనించే సూర్యుడు మార్చి 27 ఉట్నూర్ మండలం రిపోర్టర్ షైక్ సోహెల్ పాషా ఉట్నూర్: ఉట్నూర్ మండలానికి చెందిన కరీపె శోభ  తీవ్రమైన రక్తహీనత రక్తంలో కేవలం 3.2 గ్రాముల హీమోగ్లోబిన్ఉండడంతో అస్వస్థతకు గురై ఉట్నూర్ ప్రభుత్వ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు వైద్యుల పరీక్షలలో ఆమెకు అత్యవసరంగా బీ పాజిటివ్ రక్తం అవసరమని నిర్ధారణ అయింది ఈ విషయం తెలుసుకున్న సాయి కుమార్ వెంటనే స్పందించి ఆసుపత్రికి చేరుకుని రక్తదానం చేశారు ఆయన చేసిన ఈ సేవతో రోగికి సమయానికి రక్తం అందడంతో చికిత్స కొనసాగుతోంది ఈ రక్తదాన కార్యక్రమంలో బ్రదర్స్ హ్యూమానిటీ ఫౌండేషన్ ఉట్నూర్ అధ్యక్షులు రాహేల్ ఖాన్  సమన్వయం చేసి సహకరించారు అలాగే ప్రభుత్వ ఆసుపత్రి వైద్యులు మరియు సిబ్బంది అవసరమైన చర్యలు తీసుకున్నారు అత్యవసర సమయంలో రక్తదానం చేసి ప్రాణాలను కాపాడడం గొప్ప మానవతా సేవగా వైద్యులు అభినందించారు రక్తదానం చేయడానికి ముందుకు వచ్చిన సాయి కుమార్ ని స్థానికులు ప్రశంసించారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *