
పయనించే సూర్యుడు మార్చ్ 27 కర్నూలు జిల్లా ఇంచార్జ్ శ్రీకాంత్ దళితులపై దాడులు పెరిగితే ప్రభుత్వం కూడా నోరెత్తాల్సిందే! ఎన్నికలకు ముందు దళితులపై అపర ప్రేమను చూపించాల్సిన రాజకీయ నాయకులు అధికారం చేపట్టి ప్రభుత్వాలు లోకి వచ్చిన వెంటనే దళితులను విస్మరిస్తున్నారని ఇది సరైన పద్ధతి కాదని దళిత హక్కుల పోరాట సమితి (డి హెచ్ పి ఎస్) జిల్లా కార్యదర్శి మహేష్ అన్నారు. దళితులపై దాడులు జరిగితే హామీ లు ఇచ్చి అధికారంలోకి వచ్చిన ప్రభుత్వం కూడా నోరతాల్సిందేనని ఆయన సూచించారు గురువారం డి హెచ్ పి ఎస్ ఆదోని పట్టణ సమితి సదస్సు స్థానిక భీమా స్థాల్లో డిహెచ్పిఎస్ నాయకులు ఎస్ కుమార్ స్వామి అధ్యక్షతన జరిగింది ఈ కార్యక్రమానికి డి హెచ్ పి ఎస్ జిల్లా కార్యదర్శి మహేష్ జిల్లా సహాయ కార్యదర్శి టీ వీరేష పాల్గొన్నారు ఈ కార్యక్రమాన్ని ఉద్దేశించి వారు మాట్లాడుతూ దళితులను కొట్టే చేతుల వెనుక ఎవరు ఉన్నా… ఆ చేతులు ముడుచుకునేలా చేస్తాం హెచ్చరించారు. గత సంవత్సరంలో దానాపురం సర్పంచ్ చంద్రశేఖర్ పై జరిగిన కులవ్యవక్షకు వ్యతిరేకంగా జరిగిన పోరాటంలో డి హెచ్ పి ఎస్ అగ్ర భాగాన నిలిచిందన్నారు. దళితులపై దాడులు పెరుగుతున్నాయి కానీ ప్రభుత్వం మాత్రం నిశ్శబ్దంగా చూస్తోంది. ఇది మౌన సమ్మతమా? లేక నేరస్థులకు రాజకీయ అండనా? దళితుల హక్కులపై ఎవరైనా కాలు మోపితే, ఆ కాలు బద్దలు కొట్టే ధైర్యం మాకు ఉందన్నారు. అలాగే పోలీసులు వ్యవహార శైలిని తీవ్రంగా తప్పుపట్టారు: “దాడులు జరిగితే వెంటనే కేసులు నమోదు చేయాలి. కానీ ఇక్కడ పక్కదారి పట్టించే ప్రయత్నాలు జరుగుతున్నాయన్నార. దళితులను రెచ్చగొట్టొద్దు చట్టం మాకు తెలుసు, పోరాటం మా రక్తంలో ఉందని దళితులు ఎదుర్కొంటున్న ప్రతి సమస్యకు డి హెచ్ పి ఎస్ ఉంటుందని వారు తెలిపారు.అదే కార్యక్రమంలో డిహెచ్పిఎస్ ఆదోని పట్టణ సమితి కొత్త కమిటీని ఏకగ్రీవంగా ఎన్నుకుంది. గౌరవాధ్యక్షుడు: ఎం. ప్రకాష్ పట్టణ అధ్యక్షుడు: కొత్తూరు ఈరనఉపాధ్యక్షులు: బి. గిడ్డయ్య, ఎన్. ఈరన్నకార్యదర్శి: ఏ. విజయ్ సహాయ కార్యదర్శులు: వై. ప్రదీప్, ఎస్. నాగరాజుకోశాధికారి: కె. రమేష్ కుమార్దీంతోపాటు మరో పదిమందిని కార్యవర్గ సభ్యులుగా ఎన్నుకున్నారు. ఈ కార్యక్రమంలో సిపిఐ మండల కార్యదర్శి ఎల్లప్ప సిపిఐ పట్టణ సహకార దర్శి రమేష్ లక్ష్మీనారాయణ తదితరులు పాల్గొన్నారు.