నాడు యూరియా కోసం నేడు గ్యాస్ కోసం పడికాపులు

పయనించే సూర్యడు మార్చి 27 సూర్యాపేట జిల్లా నడిగూడెం ప్రతినిధి పొలంపల్లి వెంకటేశ్వర్లు గతంలో యూరియా కోసం సోసైటీ కార్యాలయం వద్ద ఎదురుచూసిన అన్నదాతల తరహాలోనే, ఇప్పుడు గ్యాస్ వినియోగదారులు గోడౌన్ల వద్ద పడిగాపులు కాస్తున్నారు. గ్యాస్ బుక్ చేసి 10 రోజులు గడుస్తున్నా ఓటీపీ రాకపోవడంతో తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. గ్యాస్ కొరత కారణంగా గంటల తరబడి లైన్ లో వేచి చూడాల్సి వస్తోందని వినియోగదారులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ప్రభుత్వం స్పందించి గ్యాస్ సరఫరాను క్రమబద్ధీకరించాలని ప్రజలు కోరుతున్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *