పర్యావరణ పరిరక్షణకు ఆదర్శంగా రామాజీపేటలో సేవా సమితి – ఆలయానికి 250 స్టీల్ ప్లేట్ల విరాళం

పయనించే సూర్యుడు న్యూస్ రాయికల్ మండల్ మార్చి 27 మామిడిపెల్లి లక్ష్మణ్ రాయికల్ మండలం రామాజీపేట్ గ్రామంలో పర్యావరణ పరిరక్షణలో భాగంగా ప్లాస్టిక్ వినియోగాన్ని తగ్గించేందుకు విశేషమైన కార్యక్రమం నిర్వహించబడింది. 1994లో స్థాపితమైన శ్రీ వేంకట సాయి సేవా సమితి సభ్యులు ప్రజల ఆరోగ్యం, పర్యావరణ రక్షణను దృష్టిలో ఉంచుకుని సుమారు రూ.20,000 విలువైన 250 స్టీల్ ప్లేట్లను ఆలయానికి బహుమతిగా అందజేశారు. ఈ స్టీల్ ప్లేట్లను గ్రామంలోని శ్రీ సీతారామచంద్ర స్వామి ఆలయంలో జరిగే ప్రతీ కార్యక్రమంలో వినియోగించుకోవాలని సమితి సభ్యులు సూచించారు. ప్లాస్టిక్ వినియోగాన్ని నిషేధించాలని, ఆరోగ్యకరమైన జీవన విధానాన్ని ప్రోత్సహించాలని వారు ఆకాంక్షించారు. ఈ కార్యక్రమంలో సేవా సమితి సభ్యులు అంబాల రాంరెడ్డి, దశమందం రాంరెడ్డి, దశమందం లక్ష్మణ్, వట్టిమల్ల రాజసాగర్, సంద భూమ నరసయ్య, బద్దినపల్లి లింగం, చింతలూరి కమలాకర్, కొల్లూరి నర్సయ్య, అయిత కళాధర్, గడ్డం మల్లారెడ్డి పాల్గొన్నారు. ఆలయ కమిటీ అధ్యక్షుడు కోల రాజు ఈ విరాళాన్ని స్వీకరించారు. ఈ సందర్భంగా గ్రామ సర్పంచ్ బెజ్జంకి మోహన్, ఉప సర్పంచ్ ఇద్ధం సుధీర్ రెడ్డి, మాజీ సర్పంచ్ వాసరి రవి, మాజీ ఉప సర్పంచ్ హరీష్ రావు, దుగ్యాల రాజేశ్వర్ రావు, అయిడ్లేని గంగారెడ్డి, గుజ్జుల కిరణ్, దుగ్యాల రమాపతి రావు, సూర విజయ్, ఏనుగంటి పెద్ద లిబన్న తదితరులు పాల్గొన్నారు. ఈ కార్యక్రమం ద్వారా గ్రామంలో పర్యావరణ అవగాహన పెంపొందించడమే కాకుండా, ప్లాస్టిక్ రహిత సమాజ నిర్మాణానికి ఇది మంచి నాంది కావాలని గ్రామస్థులు అభిప్రాయపడ్డారు.