పయనించే సూర్యుడు న్యూస్ మెట్ పల్లి మార్చి 27 మెట్ పల్లి మండలంలోని కోనరావుపేట గ్రామంలో ఉన్నత పాఠశాల లో అడ్మిషన్లు ప్రారంభమైనవి. అని గ్రామ ప్రజలకు అవగాహన కల్పించడం నిమిత్తం పాఠశాల లో ప్రవేశాల కొరకై ప్రచార దండోరా గ్రామ విధుల గుండా నిర్వహించడం జరిగినది. ఈ కార్యక్రమంలో గ్రామ ఉప సర్పంచ్ జక్కని పరంధాములు, కార్యదర్శి రాణా ప్రతాప్ , కారోబార్ శ్రీనివాస్, ఏ ఏ పి సి చైర్మన్ నిఖిత, పాఠశాల ప్రధానోపాధ్యాయులు వనజ, సీనియర్ ఉపాధ్యాయులు మిరియాల రాజారెడ్డి అలాగే ఉపాధ్యాయ బృందం మరియు విద్యార్థిని విద్యార్థులు పాల్గొనడం జరిగినది.