బిజినపల్లి మండల ఎస్సీ నిరుద్యోగ యువతకు శుభవార్త

2025-26 ఎస్సీ యాక్షన్ ప్లాన్ ఫేజ్-1 దరఖాస్తుల గడువు ఏప్రిల్ 2 వరకు పొడిగింపు ఎంపీడీవో కథలప్ప

పయనించే సూర్యుడు మార్చి 27 నాగర్ కర్నూలు జిల్లా బిజినపల్లి రిపోర్టర్ కే శ్రావణ్ కుమార్ నాగర్ కర్నూల్ జిల్లాలో ఎస్సీ నిరుద్యోగ యువతకు ప్రభుత్వం శుభవార్త తెలిపింది. 2025-26 సంవత్సరానికి సంబంధించిన ఎస్సీ యాక్షన్ ప్లాన్ ఫేజ్-1 దరఖాస్తుల గడువును ఏప్రిల్ 2 వరకు పొడిగించినట్లు అధికారులు వెల్లడించారు.
ఫేజ్-2లో భాగంగా టూ వీలర్, త్రీ వీలర్, ఎలక్ట్రిక్ వాహనాల కొనుగోలుకు ఆర్థిక సహాయం అందించనున్నారు. అలాగే సోలార్ పంపులు, మైనర్ ఇరిగేషన్, డెయిరీ యూనిట్లు, వ్యవసాయ డ్రోన్లు మరియు పరికరాలపై సబ్సిడీలు ఇవ్వబడతాయి. మల్బరీ, పందిరి కూరగాయలు, పామాయిల్ సాగుకు ప్రోత్సాహం కల్పించడంతో పాటు నైపుణ్యాభివృద్ధి శిక్షణకు ప్రత్యేక ప్రాధాన్యం ఇవ్వనున్నారు. అభ్యర్థులు తప్పనిసరిగా పోర్టల్‌లో ఆన్‌లైన్ ద్వారా నమోదు చేసుకోవాలి. దరఖాస్తులకు కుల, ఆదాయ, నివాస ధృవపత్రాలు, ఆధార్ కార్డు, రేషన్ కార్డు అవసరం. ఈ పథకాలు ఎస్సీ కులానికి చెందిన నిరుద్యోగులకు మాత్రమే వర్తిస్తాయి. వ్యవసాయేతర పథకాలకు 21 నుండి 50 సంవత్సరాలు, వ్యవసాయ పథకాలకు 21 నుండి 60 సంవత్సరాలు, నైపుణ్య శిక్షణకు 18 నుండి 45 సంవత్సరాల వయస్సు పరిమితి నిర్ణయించారు. గ్రామీణ ప్రాంతాల్లో వార్షిక ఆదాయం రూ.1.5 లక్షలలోపు, పట్టణ ప్రాంతాల్లో రూ.2 లక్షలలోపు ఉండాలి. గత 5 సంవత్సరాల్లో ఎస్సీ కార్పొరేషన్ ద్వారా లబ్ధి పొందని వారు మాత్రమే అర్హులు. అర్హులైన అభ్యర్థులు వెంటనే ఆన్‌లైన్‌లో నమోదు చేసుకుని, అవసరమైన పత్రాల జిరాక్స్ ప్రతులను ఎంపీడీవో కార్యాలయంలో సమర్పించాలని ఎంపీడీవో కథలప్ప సూచించారు.