మత్స్యకారులు ప్రభుత్వ పథకాలను సద్వినియోగం చేసుకోవాలి

పయనించే సూర్యుడు న్యూస్,మార్చి 27(ఏలేశ్వరం మండల రిపోర్టర్ ఏ శివాజీ):రాష్ట్ర ప్రభుత్వ మత్స్యశాఖ వారు అమలు చేస్తున్న ప్రధానమంత్రి మత్స్య సంపద యోజన పథకంలో భాగంగా గురువారం ప్రత్తిపాడులోని తెలుగుదేశం పార్టీ కార్యాలయం వద్ద ఎస్సి,ఎస్టీ,బీసీ మరియు మహిళా మత్స్యకారులకు ధర్తీ ఆబా జన్ జాతీయ గ్రామ ఉత్కర్ష్ అభియాన్ పథకం క్రింద 40శాతం నుండి 90శాతం వరకు సబ్సిడీతో ఐస్ బాక్స్ తో కూడిన ద్విచక్ర మరియు త్రిచక్ర వాహనములను లబ్దిదారులకు ఎమ్మెల్యే వరుపుల సత్యప్రభ అందజేశారు.ఈ సందర్బంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ కూటమి ప్రభుత్వం బడుగు,బలహీన వర్గాల అభ్యున్నతికి పెద్ద పీట వేస్తుందని,ఈ పథకాలను మీరంతా సద్వినియోగం చేసుకుని అభివృద్ధి బాట పయనించాలని ఆకాంక్షిస్తున్నానని అన్నారు.ఈ కార్యక్రమంలో కూటమి శ్రేణులు, మత్స్యశాఖ అధికారి,మత్స్యకారుడు తదితరులు పాల్గొన్నారు.