మధ్యాహ్న భోజన కార్మికుల సమస్యలు పరిష్కరించాలి

ఎం ఈ ఓ కార్యాలయ సిబ్బంది విజయ్ కు వినతి పత్రం

పయనించే సూర్యుడు న్యూస్ మార్చ్ 27 అశ్వారావుపేట మండలం రిపోర్టర్ భద్రాద్రి కొత్తగూడెం జిల్లా అశ్వారావుపేట మధ్యాహ్న భోజనం కార్మికులకు రాష్ట్ర ప్రభుత్వం ఎన్నికల హామీ మేరకు పదివేల రూపాయల వేతనం పెంచాలని,మధ్యాహ్న భోజన కార్మికుల సమస్యలు పరిష్కరించాలని సిఐటియు మండల కమిటీ ఆధ్వర్యంలో ఎం ఈ ఓ కార్యాలయంలో రికార్డ్ అసిస్టెంట్ విజయ్ కు వినతి పత్రం అందజేశారు. ఈ సందర్భంగా సిఐటియు మండల కమిటీ సభ్యురాలు యామిని మాట్లాడుతూ కాంగ్రెస్ ప్రభుత్వం ప్రవేశపెట్టిన నూతన బడ్జెట్లో మధ్యాహ్న భోజన కార్మికుల వేతనాల వాగ్దానాల కు సంబంధించి ప్రస్తావనే లేదని అన్నారు. మార్కెట్లో ధరలకు తగ్గట్లుగా విద్యార్థుల మెనూచార్జీలు పెంచకపోవడం వలన వంట ఏజెన్సీ లపై మోయలేని భారం పడుతుందని అన్నారు. వంట గ్యాస్ ప్రభుత్వమే సరఫరా చేయాలని విద్యార్థులకు మెనూ సార్జీలు పెంచాలని ప్రభుత్వమే గుడ్లు పాఠశాలలకు సరఫరా చేయాలని డిమాండ్ చేశారు. మధ్యాహ్న భోజన కార్మికుల సమస్యల పరిష్కారం కొరకు ఈనెల 28న ఇందిరాపార్క్ వద్ద ధర్నా నిర్వహించనున్నట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో సిఐటియు నాయకులు పద్మ నన్ని శారమ్మ, మహాలక్ష్మి సీత తదితరులు పాల్గొన్నారు.