మహిళల అక్రమ రవాణా నివారణకు అందరు కృషి చేయాలి. అవగాహనా కార్యక్రమాల ద్వారా సాధ్యం అవుతుంది

★ సీడీపీఓ - నిర్మల జ్యోతి ★ ప్రాజెక్ట్ మేనేజర్ - బలరామ కృష్ణ ★ ప్రజ్వల స్వచ్చంద సంస్థ, మహిళా శిషు సంక్షేమ శాఖ కల్లూరు, ఖమ్మం ఆధ్వర్యంలో అంగన్వాడీ టీచర్స్ కి మానవ అక్రమ రవాణా పై రెండు రోజుల శిక్షణ ను స్థానిక ప్రాథమిక ఆరోగ్య కేంద్రం తల్లాడ మండలం నందు నిర్వహించడం జరిగింది . ★ శిక్షణ కార్యక్రమం ను జ్యోతి ప్రజ్వలన చేసి మాట్లాడుతూ

పయనించే సూర్యుడు న్యూస్ :మార్చి 27,తల్లాడ రిపోర్టర్ నిర్మల జ్యోతి సీడీపీఓ : మానవ అక్రమ రవాణా అనేది ప్రపంచం లోనే మూడవ అతి పెద్ద నేరంగా ఉంది, సమాజం లో అన్ని వర్గాల ప్రజలతో మంచి సంబంధాలను కలిగి ఉన్న అంగన్వాడీ టీచర్స్ అందరికి అవగాహనా కల్పించాలని ముక్యంగా యుక్త వయసు బాలికలు ప్రేమ పెళ్లి, ఫోన్ మోజులో పడి జీవితాలను నాశనం చేసుకుంటున్నారు. జీవితం పై ఎలాంటి అవగాహనా లేక పారిపోవడం, చివరికి మోసపోయి వ్యభిచార గృహలకు అమ్మబడుతున్నారు. అక్కడ ఎన్నో బాధలు అనుభవించి, వ్యాధులబారిన పడి చివరికి చనిపోతున్నారు. కాబట్టి వారికి ఈ సమస్యలపై అవగాహనా కల్పించాలి అని అన్నారు. ఏవైన ఆపద, సమస్యలు ఉన్నట్లు గ్రహిస్తే వెంటనే సంబంధిత అధికారులను గాని, టోల్ ఫ్రీ నంబర్స్ 100, 1098, 1930 లను సంప్రదించాలి అని సూచించారు. బలరామ కృష్ణ సీనియర్ ప్రాజెక్ట్ మేనేజర్ ప్రజ్వల : ప్రజ్వల స్వచ్చంద సంస్థ. ఆడపిల్లల మహిళల రక్షణ కొరకు స్థాపించబడింది. పద్మశ్రీ డాక్టర్. సునీత కృష్ణన్ ఆధ్వర్యంలో ఇప్పటి వరకు 32500 మంది అమ్మాయిలను చిన్న పిల్లలను కాపడి పునరావాసం కల్పించడం జరిగింది . ఇందులో పిల్లల మహిళల సమస్యలను గుర్తించి సంబంధిత అధికారుల ద్వారా రిపోర్ట్ చేయడం, ఈ శిక్షణలో అక్రమ రవాణా, సైబర్ ట్రాఫికింగ్, లైంగిక వ్యాపారం లో మోసపోతున్న అమ్మాయిల పరిస్థితులు ఎలా ఉన్నాయ్ లాంటి వాటిని లఘు చిత్రల ద్వారా, పవర్ పాయింట్ ప్రెసెంటేషన్, గ్రూప్ చర్చల ద్వారా నిర్వహించడం జరిగింది. మనం అప్రమతంగా ఉండి సమాజాన్ని చైతన్యం చేస్తే అక్రమ రవానను నిరోదించ వచ్చు అని అన్నారు అదే విదంగా పాఠశాల, గ్రామ స్థాయిలో సమాజ జాగృతి సంఘాలను విద్యార్ధి జాగృతి సంఘాలను ఏర్పాటు చేసి రిపోర్ట్ చేయడం ద్వారా అక్రమ రవాణా నివారించవచ్చు అని అన్నారు. అక్రమ రవాణాకు లేదా సైబర్ ట్రాఫికింగ్ కి గురి అయినప్పుడు భయపడకుండా దగ్గర్లోని పోలీస్ స్టేషన్ లో గాని లేదా 100, 1930 టోల్ ఫ్రీ నంబర్స్ ను సంప్రదించాలి అని సూచించారు. జిల్లా మహిళా సాధికారత కేంద్రం మేనేజర్ సమ్రీన్ మాట్లాడుతూ మహిళలు గృహ హింసకు గాని వరకట్నం వేధింపులకు గాని, పని ప్రదేశం లో లైంగిక దాడికి గురి అయితే 181 టోల్ ఫ్రీ నెంబర్ ద్వారా సఖి కేంద్రాన్ని సంప్రదిస్తే న్యాయ సహాయం అందిస్తామని అన్నారు ఈ కార్యక్రమం లో సూపర్ వైజర్ లు రోజా , సత్యవతి, రత్న కుమారి మరియు ప్రజ్వల సిబ్బంది సురేష్ కుమార్,అనిల్ కుమార్ మరియు తల్లాడ మండలం లోని అంగన్వాడీ టీచర్స్ పాల్గొన్నారు.