మెట్ పల్లి కోర్ట్ బార్ అసోసియేషన్ ఎన్నికలలో సీనియర్ ఎగ్జిక్యూటివ్ కమిటీ సభ్యునిగా ఏకగ్రీవంగా ఎన్నికైన అబ్దుల్ హఫీజ్.

పయనించే సూర్యుడు న్యూస్ మెట్ పల్లి మార్చి 27 మెట్ పల్లి కోర్టు బార్ అసోసియేషన్ ఎన్నికలలో సీనియర్ ఎగ్జిక్యూటివ్ కమిటీ సభ్యునిగా ఏకగ్రీవంగా ఎన్నికైన అడ్వకేట్ అబ్దుల్ హఫీజ్. అబ్దుల్ హఫీజ్ అసిస్టెంట్ గవర్నమెంట్ లీడర్ గా సేవలు అందించడమే కాకుండా మెట్ పల్లి టౌన్ మునిసిపాలిటీ మాజీ కో ఆప్షన్ సభ్యునిగా మాజీ ఆంధ్రప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ అడ్వైజర్ ,బోర్డు సభ్యునీ,గా అలాగే తెలంగాణ ప్రదేశ్ మైనారిటీ కమిటీ డిపార్ట్మెంట్ కన్వీనర్ గా సమాజానికి విశిష్ట సేవలు అందించిన ప్రముఖ వ్యక్తిగా నిలిచారు. ఈ సందర్భంగా ఆయనను సీనియర్ ఎగ్జిక్యూటివ్ కమిటీ సభ్యునిగా ఏకగ్రీవంగా ఎన్నుకునేందుకు సహకరించిన మెట్ పల్లి బార్ అసోసియేషన్ సభ్యులందరికీ ప్రత్యేక కృతజ్ఞతలు తెలియజేశారు. తగిన విధంగా అసోసియేషన్ ప్రతిష్టను మరింతగా పెంచుతూ ఆయన వృత్తి, నైతిక విలువలను కాపాడుతు సభ్యుల సంక్షేమం కోసం ,నిబంధనలతో సేవలు కొనసాగిస్తానని హామీ ఇచ్చారు. నమ్మకంతో ఉన్న ప్రేమ, విశ్వాసం ,ఎంతో విలువైనదని ఈ గౌరవానికి తగిన విధంగా సేవలందిస్తానన్నారు. ఇంతటి గౌరవానికి సహకరించిన ప్రతి బార్ అసోసియేషన్ సభ్యులకు పేరుపేరునా హృదయపూర్వకంగా కృతజ్ఞతలు తెలియజేశారు.