రూ.5 కోట్ల అభివృద్ధి పనులకు శంకుస్థాపన

టీడీపీ ఇన్‌చార్జ్ రాఘవేంద్ర రెడ్డి గురువారం శంకుస్థాపన చేశారు

పయనించే సూర్యుడు న్యూస్ మార్చి 27 రిపోర్టర్ అభి మంత్రాలయం నియోజకవర్గంలోని కోసిగి మండలం సాతునూరు, అగసనూరు గ్రామాల్లో రూ.5 కోట్లతో చేపట్టనున్న వివిధ అభివృద్ధి పనులకు టీడీపీ ఇన్‌చార్జ్ రాఘవేంద్ర రెడ్డి గురువారం శంకుస్థాపన చేశారు. ఈ కార్యక్రమం టీడీపీ మండల అధ్యక్షుడు పల్లెపాడు రామిరెడ్డి ఆధ్వర్యంలో జరిగింది. ఈ సందర్భంగా రాఘవేంద్ర రెడ్డి మాట్లాడుతూ, కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత గ్రామీణ ప్రాంతాల అభివృద్ధికి పెద్దపీట వేస్తున్నామని తెలిపారు. రోడ్లు, మౌలిక వసతులు, తాగునీరు వంటి కీలక అంశాల్లో అభివృద్ధి పనులు వేగంగా జరుగుతున్నాయని పేర్కొన్నారు.
గ్రామాల అభివృద్ధితో ప్రజల జీవన ప్రమాణాలు మెరుగుపడతాయని, ప్రభుత్వం ఇచ్చిన హామీలను దశలవారీగా అమలు చేస్తున్నామని ఆయన అన్నారు. కార్యక్రమంలో స్థానిక నాయకులు, కార్యకర్తలు, గ్రామస్థులు పాల్గొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *